Diabetes : డయాబెటిస్‌ కంట్రోల్‌కు ఇది చక్కటి మందు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : డయాబెటిస్‌ కంట్రోల్‌కు ఇది చక్కటి మందు..

 Authored By mallesh | The Telugu News | Updated on :17 March 2022,6:00 pm

Diabetes : కీరదోస తినేందుకు చాలా మంది ఇష్టం చూపుతారు. దీనిని ముక్కలుగా చేసుకుని దానిపై కాస్త ఉప్పు, కారం చల్లుకుని తింటే ఈ టేస్టే వేరు. ఎక్కువగా ఎండాకాలంలో ఇలా చాలా మంది ట్రై చేస్తుంటారు. దీని వల్ల శరీరంలో నీటి శాతాన్ని పెంచుకోవచ్చు. బాడీ సైతం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. వేసవి కాలంలో చాలా మంది తమ దాహాన్ని తీర్చుకునేందుకు ఎక్కువగా కీరదోసను తింటుంటారు. దీనికే కాకుండా సలాడ్స్ లోనూ, సౌందర్య రక్షణకు సైతం ఉపయోగిస్తుంటారు. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు.

ఆరోగ్య సమస్యలను నివారించడంలో ఇది చాలా సహాయపడుతుంది. ఇందులోని నీరు మొత్తం బాడీని హైడ్రేట్ గా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది.మలబద్దకాన్ని సైతం నివారిస్తుంది. దీని వల్ల కంటి సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక వ్యవస్థ, పునరుత్పత్తికి సహాయం చేస్తుంది. గుండె, ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయడంలోనూ ఇది సహాయపడుతుంది. ఎములక వ్యాధి, గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధులను నివారించడంలోనూ ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కీరదోస వల్ల చర్మానికి రక్షణ లభిస్తుంది. వాపు, దెబ్బతిన్న శరీరాన్ని తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది వీటిని కళ్ల కింద బ్యాగ్ లను తగ్గించుకునేందుకు,

Diabetes health benefits of Keera Dosa

Diabetes health benefits of Keera Dosa

ఉబ్బడం తగ్గించుకునేందుకు ముక్కులుగా చేసి కళ్ల కింద ఉంచుకుంటారు. రక్తంలోని చెక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. రక్తంలో చెక్కరలు తగ్గే సమయంలో హైపోగ్లైసీమియా ప్రమాదాన్ని తగ్గించడంలోనూ ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ చాలా మందికి తెలియదు. అందుకు దీనిని తీసుకునే క్రమంలో కొందరు అఇష్టత చూపుతారు. వీటి ధర కూడా సామాన్యుడికి అందుబాటులోకి ఉంటుంది. వీటిని ముక్కలుగా చేసి కళ్ల పై పెట్టుకోవడం వల్ల కళ్లకు కాస్త రిలాక్స్ లభిస్తుంది. కళ్లలోని వేడి తగ్గుతుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది