Health Benefits : గచ్చకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : గచ్చకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Health Benefits : గచ్చకాయలు ఈ పేరుని మన చిన్నప్పటినుంచి వింటూనే ఉంటాము. వీటితో చిన్నప్పుడు ఆడుకోవడం, బండ మీద రుద్ది పక్కనున్న వారి చర్మానికి పెడితే అది చురుక్కుమంటుంది. అలాగే ఈ గచ్చకాయల తో గచ్చకాయల ఆట ఆడుకుంటూ ఉంటారు. వీటితో ఆడుకోవడమే కాదు వీటిని ఆభరణాలుగా చేసుకుని పెట్టుకుంటారు కూడా. వీటిని పొలాల గట్ల కు జంతువులు ప్రవేశించకుండా అడ్డుగా కట్టేవారు. ఈ చెట్లు ఎక్కువగా తెలంగాణ,ఆంధ్రలలో ఎక్కువగా చూస్తూ ఉంటాము.ఈ గచ్చకాయలలో ఎన్నో […]

 Authored By mallesh | The Telugu News | Updated on :24 February 2022,2:00 pm

Health Benefits : గచ్చకాయలు ఈ పేరుని మన చిన్నప్పటినుంచి వింటూనే ఉంటాము. వీటితో చిన్నప్పుడు ఆడుకోవడం, బండ మీద రుద్ది పక్కనున్న వారి చర్మానికి పెడితే అది చురుక్కుమంటుంది. అలాగే ఈ గచ్చకాయల తో గచ్చకాయల ఆట ఆడుకుంటూ ఉంటారు. వీటితో ఆడుకోవడమే కాదు వీటిని ఆభరణాలుగా చేసుకుని పెట్టుకుంటారు కూడా. వీటిని పొలాల గట్ల కు జంతువులు ప్రవేశించకుండా అడ్డుగా కట్టేవారు. ఈ చెట్లు ఎక్కువగా తెలంగాణ,ఆంధ్రలలో ఎక్కువగా చూస్తూ ఉంటాము.ఈ గచ్చకాయలలో ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ గచ్చకాయల ను వివిధ రకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు.ఈ గచ్చకాయలు మలేరియా జ్వరాన్ని, డెంగ్యూ జ్వరం వంటి వాటి నుంచి ఎదుర్కోవడానికి ఇవి సహాయపడతాయి.

ఈ గచ్చకాయ ఆకులతో లేదా కొమ్మలతో పంటి నొప్పిని కూడా తగ్గించుకోవచ్చును. ఈ ఆకులను లేదా కొమ్మలను పేస్టుగా చేసుకొని వంటి మీద ఉంచుకోవడం వల్ల పంటి ఉపశమనం కలుగుతుంది. వీటి ఆకులను ఉపయోగించి గొంతు నొప్పిని కూడా తగ్గించుకోవచ్చును. ఈ ఆకులను ఉడకబెట్టి ఆ నీటిని తీసుకోని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.ఈ గచ్చకాయ వల్ల అధిక చెమటను, చెమట నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించుకోవచ్చును ఈ ఆకుల రసంతో ఎలిఫెంటీయాసిస్ కూడా తగ్గించుకోవచ్చును. పూర్వకాలంలో మసూచి వ్యాధిని ఎదుర్కోవడంలో ఈ గచ్చకాయ ఉపయోగపడింది ఈ గచ్చకాయలు రక్తస్రావం వంటి సమస్యలను ఎదుర్కోవడంలో కూడా ఉపయోగపడతాయి

Health Benefits of gachakaya

Health Benefits of gachakaya

Health Benefits : ఈ గచ్చకాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

అంతేకాకుండా చర్మ సమస్యలు, కుష్టి వ్యాధి వంటి వాటిని ఎదుర్కోవడంలో కూడా గచ్చకాయ ఉపయోగపడతాయి. ఈ గచ్చకాయలు మూత్ర సమస్యల నుంచి లివర్ సమస్యలనుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తాయి.ఈ గచ్చకాయలు రుతుక్రమ సమస్యలను, మెనోపాజ్ సమస్యల నుంచి ఋతుస్రావంలో ఏర్పడి నొప్పిని కూడా ఈ గచ్చకాయలు తగ్గిస్తాయి. పేగులలో ఉండే నులిపురుగులను కూడా ఇవి ఎదుర్కొంటాయి. ఈ మొక్క లో ఉండే యాంటీడేరియల్ చర్య విరేచనాలు,అలాగే వదులుగా ఉండే పేగులను నయం చేస్తుంది. అంతేకాకుండా కొలీక్ నొప్పి నివారణ సులభతరం చేస్తుంది. కిడ్నీలో రాళ్ల సమస్య లకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది