Giloy Leaves : ఈ మొక్క ఆరోగ్యానికి దివ్య ఔషధం… ప్రయోజనాలు తెలిస్తే… ఎక్కడున్నా ఇంటికి తెచ్చుకుంటారు…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Giloy Leaves : ఈ మొక్క ఆరోగ్యానికి దివ్య ఔషధం… ప్రయోజనాలు తెలిస్తే… ఎక్కడున్నా ఇంటికి తెచ్చుకుంటారు…??

 Authored By ramu | The Telugu News | Updated on :31 October 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Giloy Leaves : ఈ మొక్క ఆరోగ్యానికి దివ్య ఔషధం... ప్రయోజనాలు తెలిస్తే... ఎక్కడున్నా ఇంటికి తెచ్చుకుంటారు...??

Giloy Leaves : మన పరిసర ప్రాంతంలో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వాటిని మనం పిచ్చి మొక్కలు అని అనుకుంటూ ఉంటాం. కానీ వాటిలో కూడా మన ఆరోగ్యా నికి మేలు చేసే ఎన్నో మొక్కలు ఉన్నాయి. వాటిలలో ఒకటి తిప్పతీగ. ఆయుర్వేద ప్రకారం చూస్తే,ఈ మొక్కను అమృతంతో పోలుస్తారు. అలాగే ఈ తిప్పతీగలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అలాగే ఈ తీగలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇది కణాలను ఎంతో ఆరోగ్యంగా మారుస్తుంది. అంతేకాక ఫ్రీ రాడికల్స్ ను మరియు వ్యాధి కలిగించే క్రిములను అరికట్టడంలో ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇకపోతే ఈ తిప్ప తీగ రసం తాగితే రోగనిరోధక శక్తి అనేది ఎంతో పెరుగుతుంది. అలాగే జ్వరం నుండి ఉపశమనం పొందాటానికి ఈ తిప్పతీగ ఆకులు బాగా హెల్ప్ చేస్తాయి…

ఈ తిప్పతీగను ఇతర రూపాలలో తీసుకుంటే ఇన్ఫెక్షన్ నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ తీగ శరీరంలోని టాక్సిన్స్ ను కూడా తొలగిస్తుంది. అంతేకాక రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. అలాగే యుటిఐ సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే ఈ తీగ అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ తీగతో గ్యాస్ మరియు మలబద్ధకం, ఎసిడిటీ లాంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఈ ఆకులను ప్రతిరోజు ఖాళీ కడుపుతో నమలి తీసుకోవడం వలన జీర్ణక్రియ ఎంతో మెరుగుపడుతుంది. ఈ తిగ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఒత్తిడిని తగ్గించి ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతాయి. దీని వలన డయాబెటిస్ నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ తీగలో యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది శ్వాస వ్యవస్థను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ తీగను ఇతర రూపాలలో తీసుకుంటే జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు…

Giloy Leaves ఈ మొక్క ఆరోగ్యానికి దివ్య ఔషధం ప్రయోజనాలు తెలిస్తే ఎక్కడున్నా ఇంటికి తెచ్చుకుంటారు

Giloy Leaves : ఈ మొక్క ఆరోగ్యానికి దివ్య ఔషధం… ప్రయోజనాలు తెలిస్తే… ఎక్కడున్నా ఇంటికి తెచ్చుకుంటారు…??

ఈ తిప్ప తీగను అడాప్టోజెనిక్ హెర్బ్ గా కూడా వాడవచ్చు. ఈ తీగ మానసిక ఆరోగ్యాన్ని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. అంతేకాక ఒత్తిడిని కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే ఆందోళనను కూడా దూరం చేస్తుంది. ఈ తీగ యొక్క రసాన్ని తాగితే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో గుండె పనితీరు ఎంతో మెరుగుపడుతుంది. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనకు ఎదురయ్యే ఒత్తిడి దూరం చేయడంలో కూడా ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే శరీరంలో పేర్కొన్నటువంటి విష పదార్థాలను కూడా బయటకు పంపిస్తుంది. అంతేకాక మహిళలకు 45 ఏళ్లు దాటిన తర్వాత ఎముకలు ఎంతో బలహీనంగా మారతాయి. అందుకే ఈ రసాన్ని తాగితే మహిళల్లో వచ్చే బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఈ తిప్పతీగను రసం రూపంలో తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది