Lotus Leaf Tea : ఈ ఆకులతో టీ చేసుకుని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Lotus Leaf Tea : ఈ ఆకులతో టీ చేసుకుని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా…!!

Lotus Leaf Tea : తామర ఆకులు అనేవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అలాగే ఈ పువ్వులను కూడా పూజలలో ఎక్కువగా వాడతారు. అయితే ఈ తామరాకులతో తయారు చేసిన టీ అనేది ఒక రకమైన హెర్బిల్ టీ అని చెప్పొచ్చు. దీనిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అయితే ఈ తామరాకులతో తయారు చేసిన టీ ని తాగటం వలన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని తీసుకోవటం వలన ఎన్నో […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 October 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Lotus Leaf Tea : ఈ ఆకులతో టీ చేసుకుని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా...!!

Lotus Leaf Tea : తామర ఆకులు అనేవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అలాగే ఈ పువ్వులను కూడా పూజలలో ఎక్కువగా వాడతారు. అయితే ఈ తామరాకులతో తయారు చేసిన టీ అనేది ఒక రకమైన హెర్బిల్ టీ అని చెప్పొచ్చు. దీనిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అయితే ఈ తామరాకులతో తయారు చేసిన టీ ని తాగటం వలన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని తీసుకోవటం వలన ఎన్నో రకాల సమస్యల నుండి కూడా బయటపడవచ్చ. అయితే మొదటగా ఈ టీ ని ఎక్కువగా చైనాలో తాగేవారు. ఇప్పుడు ఇది ఆసియా అంతటా కూడా ఎంతో ఫేమస్ అయ్యింది.

తామర ఆకులతో తయారు చేసినటువంటి టీని తాగితే దీనిలో పొటాషియం అధికంగా ఉండటం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకులతో తయారు చేసిన టీని తాగటం వలన శరీరంలో వాపు మరియు చికాకు అనేది తొలగిపోతుంది. అయితే ఈ తామర ఆకులలో జీవ క్రియను పెంచడానికి సహాయ పడే పోషకాలు ఉన్నాయి. అలాగే వేగంగా బరువు తగ్గేందుకు కూడా హెల్ప్ చేస్తాయి. అయితే ఈ టీలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మలబద్ధకం లాంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది…

Lotus Leaf Tea ఈ ఆకులతో టీ చేసుకుని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా

Lotus Leaf Tea : ఈ ఆకులతో టీ చేసుకుని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా…!!

తామర ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫ్లేవ నాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను అదుపులో ఉంచి గుండెను ఎంతో రక్షిస్తుంది. అలాగే ఈ టీ ని తాగటం వలన శరీరాన్ని నొప్పుల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. దీంతో వాపు కూడా తొందరగా తగ్గుతుంది. అయితే ఈ తామరాకులో ఉన్న యాంటీ యాక్సిడెంట్ నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈ టీ ని తీసుకోవడం వలన ఒత్తిడి మరియు ఆందోళన నుండి కూడా బయటపడొచ్చు. అయితే ఈ పువ్వులో ఉన్నటువంటి పోషకాలు మిమ్మల్ని రిలాక్స్ చేస్తాయి. అలాగే మీరు బాగా అలసిపోతే వెంటనే లోటస్ టీ తాగితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వలన శరీరంలో ఎనర్జీ లెవల్ అనేది ఎంతో బాగా పెరుగుతుంది…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది