Home » Exclusive » Health Benefits Of Millets
Exclusive

Health Benefits : బ్యాడ్ కొలెస్ట్రాల్ కు కార‌ణం ఇదే.. కాలేయంలో ఇది ఎక్కువ‌గా ఉంటే డేంజ‌ర్

Authored By
mallesh
The Telugu News | Published on: April 3, 2022, 7:00 am
Advertisement

Health Benefits: రోజు రోజుకీ మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎక్కువ మంది సాధారణంగా ఎదుర్కొంటున్న సమస్య అధిక కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ అధికంగా పెరగడం వలన ఊబకాయం, గుండె జబ్బులు వస్తాయి. దీర్ఘకాలంలో గుండె జబ్బులు ప్రమాదాన్ని కూడా పెంచే అవ‌కాశం ఉంది. చెడు కొవ్వు ధమనుల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.కొలెస్ట్రాల్ అనేది కాలేయంలో ఉత్ప‌త్తి చేయ‌బ‌డే కొవ్వు వంటి పదార్థం. మ‌నిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి చెడుదైతే రెండవది మంచిది. చెడు కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు దారి తీస్తోంది.

Advertisement

మనిషి శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్ ఎంతమంచిదో..బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతే ప్రమాదకరం. గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధులకు దారి తీస్తుంది. కనుక శరీరంలో చెడు కొలస్ట్రాల్ స్థాయిని పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.కూరగాయలు అధికంగా తీసుకుంటే వాటిలో ఉండే ఫైబర్ శరీరానికి చలా శక్తిని ఇస్తుంది. శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తుంది. వంకాయ, బెండకాయలో అధికంగా ఉండే ఫైబర్..కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. బ్రకోలి, చిలకడదుంప కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. తృణ ధాన్యాలు. వీటిని ప్రతి నిత్యం తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్‌ను తగ్గించవచ్చు.

health benefits of millets

Advertisement

Health Benefits : నూనెలో వేయించిన ఆహారాలు

నట్స్‌లో ఉండే ప్రోటీన్ రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తృణధాన్యాల్లో ఉండే ఫైబర్ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.అధిక కొవ్వు సమస్యతో బాధపడే వారు నూనెలో వేయించిన పదార్ధాలకు దూరంగా ఉండడం మంచిది. అదనపు ఉప్పు, ఆయిల్ ఫుడ్స్ లో పోషకాలు ఉండవు. వీటిలోని అధిక కొవ్వు పదార్ధం.. గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశం అధికంగా ఉంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి