
health benefits of nela usiri
Health Benefits : నేల ఉసిరి మొక్క గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ మొక్క భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతే కాదు ఈ నేల ఉసిరిని ఎన్నో ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేరటీ లక్షణాలను కల్గి ఉంటుంది. నేల ఉసిరి ఆకులను జ్యూస్ గా చేసుకొని తాగడం వల్ల పొత్తి కడుపు మంట తగ్గుతుంది. అలాగే మూత్ర విసర్జన, మూత్ర ఇన్ఫెక్షన్ లను తగ్గిస్తుంది. అంతే కాకుండా శరీరంపై వచ్చే పూతలు, గాయాలు, గజ్జి వంటి వాట చికిత్సలో నేల ఉసిరిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీర్ఘ కాలిక గాయాలు, అటోపిక్ చర్మశోథ, ప్రురిటస్, చర్మపు పూతలు వంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు నేలఉసిరి కాయల రసం చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాలేయం నుంచి పిత్త ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకాన్ని తగ్గించి… జీర్ణక్రియను నిర్వహిస్తుంది. కాలేయ పనితీరును మెరుగు పరచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
నేల ఉసిరి జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలో ఉండే రాళ్లు కరిగిపోతాయి. అంతే కాకుండా కిడ్నీలో ఏర్పడే ఇతర రకాస సమస్యల నుంచి ఉపశమనం కల్గుతుంది. ఈ రసం హైపర్ కాల్సియురియా, హైపోమాగ్నెసియూరియా మొదలైన జీవక్రియ అసాధారణతలపై ప్రతిభావంతంగా పనిచేస్తుంది. అలాగే కామెర్లు, హెపటైటిస్, కాలేయ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాలేయం సమస్యల వల్ల వచ్చే కంటి సమస్యలకు చికిత్స చేసేందుకు నేస ఉసిరి రసాన్ని ఉపయోగిస్తుంటారు. ఉదయం పరగడుపున గోరు వెచ్చని గ్లాసు నీళ్లలో ఈ రసాన్ని కలిపి తాగడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధుమేహానికి కూడా ఈ జ్యూస్ అధ్భుతంగా పనిచేస్తుంది.
health benefits of nela usiri
నేల ఉసిరి రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే శక్తిని కల్గి ఉంటుంది. దీని చేదు డయాబెటిక్ సమస్యల నుంచి ఉపశమనం కల్గజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పిత్త బ్యాలెన్స్ ను పునరుద్ధరించడానికి నేస ఉసిరి రసం ప్రసిద్ధి చెందింది. శరీరంలో ఏర్పడే ఎసిడిటీ, ఆమ్లత్వం నుంచి ఉపశమనం పొందడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ జ్యూస్ తాగడం వల్ల చర్మం వచ్చే దురద, గజ్జి, తామర… వంటి వాటికి చెక్ పెట్టి ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే పైన చెప్పినటువంటి సమస్యలతో బాధపడే వాళ్లు నేస ఉసిరి జ్యూస్ ను తరచుగా తీసుకుంటూ ఉంటారు.
Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…
Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…
Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…
Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…
Blue Berries : మార్కెట్‌లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
This website uses cookies.