Health Benefits : సర్వరోగ నివారిణిగా పని చేసే నేల ఉసిరి గురించి మీకీ విషయాలు తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : సర్వరోగ నివారిణిగా పని చేసే నేల ఉసిరి గురించి మీకీ విషయాలు తెలుసా?

Health Benefits : నేల ఉసిరి మొక్క గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ మొక్క భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతే కాదు ఈ నేల ఉసిరిని ఎన్నో ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేరటీ లక్షణాలను కల్గి ఉంటుంది. నేల ఉసిరి ఆకులను జ్యూస్ గా చేసుకొని తాగడం వల్ల పొత్తి కడుపు మంట తగ్గుతుంది. అలాగే మూత్ర విసర్జన, మూత్ర ఇన్ఫెక్షన్ లను తగ్గిస్తుంది. అంతే […]

 Authored By pavan | The Telugu News | Updated on :16 March 2022,8:20 am

Health Benefits : నేల ఉసిరి మొక్క గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ మొక్క భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతే కాదు ఈ నేల ఉసిరిని ఎన్నో ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేరటీ లక్షణాలను కల్గి ఉంటుంది. నేల ఉసిరి ఆకులను జ్యూస్ గా చేసుకొని తాగడం వల్ల పొత్తి కడుపు మంట తగ్గుతుంది. అలాగే మూత్ర విసర్జన, మూత్ర ఇన్ఫెక్షన్ లను తగ్గిస్తుంది. అంతే కాకుండా శరీరంపై వచ్చే పూతలు, గాయాలు, గజ్జి వంటి వాట చికిత్సలో నేల ఉసిరిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీర్ఘ కాలిక గాయాలు, అటోపిక్ చర్మశోథ, ప్రురిటస్, చర్మపు పూతలు వంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు నేలఉసిరి కాయల రసం చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాలేయం నుంచి పిత్త ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకాన్ని తగ్గించి… జీర్ణక్రియను నిర్వహిస్తుంది. కాలేయ పనితీరును మెరుగు పరచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

నేల ఉసిరి జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలో ఉండే రాళ్లు కరిగిపోతాయి. అంతే కాకుండా కిడ్నీలో ఏర్పడే ఇతర రకాస సమస్యల నుంచి ఉపశమనం కల్గుతుంది. ఈ రసం హైపర్ కాల్సియురియా, హైపోమాగ్నెసియూరియా మొదలైన జీవక్రియ అసాధారణతలపై ప్రతిభావంతంగా పనిచేస్తుంది. అలాగే కామెర్లు, హెపటైటిస్, కాలేయ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాలేయం సమస్యల వల్ల వచ్చే కంటి సమస్యలకు చికిత్స చేసేందుకు నేస ఉసిరి రసాన్ని ఉపయోగిస్తుంటారు. ఉదయం పరగడుపున గోరు వెచ్చని గ్లాసు నీళ్లలో ఈ రసాన్ని కలిపి తాగడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధుమేహానికి కూడా ఈ జ్యూస్ అధ్భుతంగా పనిచేస్తుంది.

health benefits of nela usiri

health benefits of nela usiri

నేల ఉసిరి రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే శక్తిని కల్గి ఉంటుంది. దీని చేదు డయాబెటిక్ సమస్యల నుంచి ఉపశమనం కల్గజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పిత్త బ్యాలెన్స్ ను పునరుద్ధరించడానికి నేస ఉసిరి రసం ప్రసిద్ధి చెందింది. శరీరంలో ఏర్పడే ఎసిడిటీ, ఆమ్లత్వం నుంచి ఉపశమనం పొందడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ జ్యూస్ తాగడం వల్ల చర్మం వచ్చే దురద, గజ్జి, తామర… వంటి వాటికి చెక్ పెట్టి ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే పైన చెప్పినటువంటి సమస్యలతో బాధపడే వాళ్లు నేస ఉసిరి జ్యూస్ ను తరచుగా తీసుకుంటూ ఉంటారు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది