Tea : ఈ టీ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే… అస్సలు వదలరు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea : ఈ టీ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే… అస్సలు వదలరు…!

 Authored By ramu | The Telugu News | Updated on :20 August 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Tea : ఈ టీ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే... అస్సలు వదలరు...!

Tea : రోజ్మెరీ అనేది పుదీనా ఫ్యామిలీకి చెందినటువంటిది. దీనిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఈ మూలికలనేవి మీ మనసు మరియు శరీరం ఆత్మ రిఫ్రెష్ చేయగల సమ్మేళనాలు ఎన్నో ఉన్నాయి. అయితే రోజూ ఉదయం పూట వీటితో టీ చేసుకుని తాగటం వలన ఎంతో ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా ఉంటారు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిని ఒక రకమైన హెర్బల్ టీ గా కూడా చెబుతున్నారు. అయితే ఈ రోజ్మెరీ టీ ని తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజ్మెరీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే శరీరంలో ఫ్రీ రాడికల్స్ వలన కలిగే ఆక్సికరణ ఒత్తిడితో కూడా పోరాడగలదు. అంతేకాక కణాల నష్టం మరియు వాపును కూడా నియంత్రిస్తుంది.

అలాగే రోజ్మెరీ తో తయారు చేసిన టీ ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవటం వలన జీర్ణక్రియను తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది కడుపు ఉబ్బరం లాంటి కడుపుకు సంబంధించిన సమస్యలను కూడా నివారించగలదు. అలాగే రోజ్మెరీ మీ జ్ఞాపక శక్తి ని మరియు చురుకుదనాన్ని కూడా మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తుంది. దీనిలో యాంటీ యాక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు మెదడు పనితీరుకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజ్మెరీ లోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచగలవు. ఈటీని తీసుకోవటం వలన వ్యాధి కారక క్రిములతో పోరాడడానికి మరియు శరీర రక్షణను బలంగా చేసేందుకు కూడా ఎంతో మేలు చేస్తాయి. మన శరీరం సక్రమంగా పని చేయడానికి హైడ్రేషన్ అనేది చాలా అవసరం. ఈ రోజ్మెరీ టీ అనేది మీ శరీరంలో ఎంతో తాజాదనాన్ని పెంచగలదు. ఈ రోజ్మెరీ లో సహజంగా లభించే రసాయనం కంటి సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది అని అధ్యయనాల్లో కూడా తేలింది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లోమెంటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కంటి చూపును మెరుగుపరచడంలో కూడా ఎంతో మేలు చేస్తాయి.

Tea ఈ టీ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

Tea : ఈ టీ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే… అస్సలు వదలరు…!

అయితే ఈ రోజ్మెరీ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించగలవు. దీని మొక్కల సమ్మేళనాలు జీర్ణాశయంలో చక్కర శోషణ ను కూడా నెమ్మదిస్తాయి. అలాగే భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గిస్తుంది. ఈ రోజ్మెరీ లో కార్నోసోల్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నియంత్రించగలదు. అలాగే రోగనిరోధక శక్తిని కూడా బలంగా చేస్తుంది. మీరు తీసుకున్న ఆహారం సరిగా చేయడం కావాలి అంటే జీర్ణ ఎంజైమ్ లు చాలా అవసరం. ఈ రోజ్మెరీలో ఉండే పోషకాలు జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని పెంచుతాయాని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ టీ ని తీసుకోవడం వలన జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక ఎంతోమంది ని ఇబ్బంది పెట్టే అజీర్ణం మరియు ఉబ్బరం మరియు గ్యాస్ లాంటి సమస్యల ను కూడా ఇది క్లియర్ చేయగలదు…

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది