Health Benefits : 4 తులసి ఆకులని నిత్యము ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు…!

 Authored By prabhas | The Telugu News | Updated on :27 October 2022,6:40 am

Health Benefits : తులసి మొక్కని ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మొక్క నీ నాటుతున్నారు. హిందూ సాంప్రదాయాలలో ఈ తులసిని పూజిస్తూ ఉంటారు. ఈ మొక్క నాటిన ఇంట్లో ఐశ్వర్యానికి సంతోషానికి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తుంటారు. అయితే ఈ తులసి ఆకులని తీసుకోవడం వలన షుగర్ తో సహా ఇంకొక ఐదు ముఖ్యమైన వ్యాధులు కూడా తగ్గిపోతాయి. ఈ మొక్కలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం. ఇది చాలా ప్రధానమైన మొక్కగా ఆరాధిస్తుంటారు. అటువంటి తులసి కేవలం ఆధ్యాత్మిక మొక్క నే కాకుండా ఆయుర్వేద మొక్క కూడా. ఈ ఆకులని తీసుకోవడం వల్ల కొన్ని వ్యాధులు నుంచి ఉపశమనం కలుగుతుందట అవేంటో ఇప్పుడు మనం చూద్దాం..

నోరు దుర్వాసన తొలగిపోతుంది… తులసి ఆకులతో నోటి దుర్వాసనను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. మీరు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నాలుగు తులసి ఆకులను నములుతూ ఉండడం వలన నోటి దుర్వాసన పోతుంది. ఒత్తిడి తగ్గిపోతుంది… ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడే ఒక అధ్యయన నివేదిక ప్రకారం మానసిక ఒత్తిడిని తగ్గించే కార్టీ సోల్ ను నయం చేయడానికి తులసి ఆకులు గొప్పగా సహాయపడతాయి. ఒత్తిడితో పోరాడుతున్న వాళ్లకి కూడా తులసి ఆకులు వినియోగం చాలా ఉపయోగంగా ఉంటుంది. దీనికోసం నిత్యము 12 తులసి ఆకులను నమలడం మొదలు పెట్టండి. తలనొప్పికి నివారణ…

Health Benefits of taking four tulsi leaves

Health Benefits of taking four tulsi leaves

తులసి ఆకుల నివారణ ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది. తులసి ఆకులు జలుబు, తలనొప్పి, అలర్జీ సైనస్ లాంటి వాటికి గొప్ప ఔషధంగా ఉపయోగపడుతుంది. దీనికోసం ముందుగా తులసి ఆకుల్ని నీటిలో వేసి మరిగించాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉంచాలి. తర్వాత కొద్ది కొద్దిగా మింగి వేసి తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన మంచి ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పి నివారణ… వాతావరణం చేంజ్ అయినప్పుడు గొంతు నొప్పి రావడం సాధారణమే ఈ నొప్పిని తగ్గించుకోవడానికి తులసి ఆకులని నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడకట్టి తర్వాత నెమ్మది నెమ్మదిగా తీసుకోవాలి. మీకు గొంతు నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి