Health Benefits : మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఈ డ్రింకును తాగాల్సిందే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఈ డ్రింకును తాగాల్సిందే…

 Authored By anusha | The Telugu News | Updated on :10 July 2022,3:00 pm

Health Benefits : మన శరీరానికి రోగ నిరోధక శక్తి చాలా అవసరం. రోగనిరోధ‌క‌శక్తి లేకపోతే మ‌న‌ శరీరం అనేక‌ రోగాలు బారిన పడుతుంది. ఈ ఇమ్యూనిటీ పవర్ హానికరమైన బ్యాక్టీరియాలు, ఇన్స్పెక్షన్ నుంచి మన శరీరాన్ని కాపాడుతాయి. కానీ కొంతమందిలో నిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. దీనివలన వారు అనేక రోగాల బారిన పడతారు. ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే మేము పరిచయం చేయబోయే ఈ డ్రింక్ ను కనుక తాగినట్లయితే శరీరంలో రోగ‌నిరోధ‌క‌ శక్తి పెరుగుతుంది. రోగ‌నిరోధక శక్తి తక్కువగా ఉంటే కొన్ని వ్యాధులకు చికిత్స చేయడం కష్టమే. అలాగే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. ఇంకా దగ్గు, జలుబు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటి నుంచి త్వరగా ఉపశ‌మ‌నం పొందాలంటే మన శరీరంలో రోగ‌నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి.

అయితే ఇప్పుడు ఆ డ్రింక్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.  ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మూడు మిరియాలను వేసుకోవాలి. తర్వాత అందులో 5,6 తులసి ఆకులను వేయాలి. అలాగే మూడు లవంగాలను వేసుకోవాలి. ఆ తర్వాత తిప్పతీగ కాడ‌ను రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత అర టి స్పూన్ శొంఠిపొడి, ఒక స్ఫూన్ సోంపు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒకటిన్నర గ్లాస్ నీటిని పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించడం వలన మనం వేసుకున్న వాటి అన్ని పోషకాలు నీటిలోకి దిగుతాయి. ఇలా మీరు మరిగించిన కాసేపటికి తిప్పతీగ ఆకులను వేసి బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగించిన నీళ్లలో కొద్దిగా బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. డయాబెటిస్ సమస్య ఉన్నవారు బెల్లంను వేసుకోకుండా ఉండటం మంచిది.

Health Benefits of to grow immunity power in our body with these drink

Health Benefits of to grow immunity power in our body with these drink

బెల్లం వేసుకున్న తర్వాత ఆ నీళ్లను సగం అయ్యేవరకు మరిగించుకోవాలి. అప్పుడు ఇది కషాయం లాగా తయారవుతుంది. తర్వాత ఆ నీళ్లను ఒక గ్లాసులోకి వడ కొట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున తాగాలి. అలాగే సాయంత్రం భోజనం చేయకముందు తాగాలి. ఇలా తాగడం వలన మంచి ఫలితం దక్కుతుంది. ఈ కషాయంలో ఉపయోగించిన‌వ‌న్ని సాధారణంగా మన ఇంట్లో ఉండేటివి. ఈ డ్రింకును కనుక ప్రతిరోజు తీసుకుంటే శరీరంలో రోగ‌నిరోధక శక్తి బలపడుతుంది. ఇందులో వినియోగించిన బెల్లం కూడా రోగ‌నిరోధ‌క‌ శక్తిని పెంచుతుంది. ఈ డ్రింకు మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది. ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది