
Triphala Tea : రోజుకు ఒక కప్పు త్రిఫల టీ తాగితే చాలు... ఎన్ని లాభాలో...!
Triphala Tea : ఉదయాన్నే చాలా మందికి ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. అలాగే ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు పాల టీ లేక గ్రీ టీ తాగినిదే ఆ రోజంతా ఏదో వెలితిగా ఉంటుంది. అయితే ఎంతో బలమైన రోగనిరోధక వ్యవస్థను పెంచుకోవాలి అనుకుంటే పాల టీ కి బదులుగా త్రిఫల టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది అని నిపుణులు అంటున్నారు. ఈ టీ అనేది మిమ్మల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచటంతో పాటుగా ఎన్నో రకాల వ్యాధులను కూడా దూరం చేస్తుంది. అయితే ఈ త్రిఫల టీ ని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి అనేది నిజంగానే పెరుగుతుందా అనే సందేహం చాలా మందికి ఉన్నది. నిజం చెప్పాలి అంటే. ఈ త్రిఫల టీ లో యాంటీ ఆక్సిడెంట్ స్థాయి అనేది అధికంగా ఉంటుంది. అలాగే డిటాక్సి ఫైయింగ్, యాంటీ ఇన్ ప్లమెంటరీ లక్షణాలతో పాటు ఎన్నో పోషకాలు దీనిలో అధికంగా ఉన్నాయి. త్రిఫల అనగా ఉసిరి మరియు కరక్కాయ, తానికాయలు అనే మూడు పండ్ల మిశ్రమం. ఇది ఆయుర్వేద గ్రంధాలలో ఒక ముఖ్యమైన అంశంగా చెప్పొచ్చు. ఈ త్రిఫల టీ ని తీసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం…
ఉసిరికాయలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. ఇవి ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు నిలయం అని చెప్పొచ్చు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. దీనిలో ఉన్న నిర్వీషికరణ లక్షణాలు మొత్తం ఆరోగ్యాన్ని బలంగా చేసేందుకు సహాయపడతాయి. అలాగే కరక్కాయ మరియు తానికాయలో కూడా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ తటస్థం చేసేందుకు మరియు ఆక్సికరణ ఒత్తిడి నియంత్రించడానికి, రొగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. త్రిఫల అనేది శరీరాన్ని నిర్విషికరణ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ పనితీరును నిర్వహించేందుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ త్రిఫల లో యాంటీ ఇన్ఫ్లమెంటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేవి శరీరం యొక్క ఇన్ఫెక్షలతో పోరాడేందుకు సహాయపడుతుంది…
Triphala Tea : రోజుకు ఒక కప్పు త్రిఫల టీ తాగితే చాలు… ఎన్ని లాభాలో…!
త్రిఫల టీ ని తయారు చేసేందుకు కొన్ని దశలను పాటించాలి. త్రిపాల పొడి 1 స్పూన్, ఒక కప్పు నీరు, తగినంత తేనె లేక నిమ్మకాయ చాలా అవసరం. ఎలా చేయాలి అంటే. ముందు ఒక కప్పు వాటర్ ను తీసుకొని మీడియం వేడి మీద ఈ నీటిని మరిగించాలి. ఈ నీళ్లు మరిగిన తర్వాత త్రిఫల పొడిని ఈ నీటిలో వేసి కలుపుకోవాలి. దాని తర్వాత 10 నుండి 15 నిమిషాల పాటు మూత పెట్టి వాటిని పక్కన పెట్టాలి. అప్పుడు త్రిఫల పౌడర్ యొక్క సమ్మేళనాలు అనేవి ఆ నీటిలో కరుగుతాయి. ఇప్పుడు టీ ని వడకట్టుకొని కప్పు లో పోసుకొని రుచి కోసం దానిలో నిమ్మరసం లేక తేనె కలుపుకొని తీసుకుంటే చాలు…
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.