Health Benefits : పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్ళు తాగవచ్చా.. అయితే ఏం జరుగుతుంది.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్ళు తాగవచ్చా.. అయితే ఏం జరుగుతుంది.?

Health Benefits  : వేస‌వి కాలంలో పుచ్చ‌కాయ‌ను తినడం వల్ల ఎన్ని రకాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వాటిని తినడం వాళ్ళ మ‌న శ‌రీరానికి అవ‌స‌రమైన ముఖ్య‌మైన విట‌మిన్స్ , మిన‌ర‌ల్స్ అందుతాయి. దీనికి తోడు ప‌లు అనారోగ్య స‌మస్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. పుచ్చకాయ వేసవికాలంలో విరివిగా దొరుకుతూ ఉంటుంది. పుచ్చకాయ దాహం తీర్చడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందులో ఉన్న పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి.అదేవిధంగా చర్మాన్ని […]

 Authored By mallesh | The Telugu News | Updated on :22 February 2022,1:30 pm

Health Benefits  : వేస‌వి కాలంలో పుచ్చ‌కాయ‌ను తినడం వల్ల ఎన్ని రకాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వాటిని తినడం వాళ్ళ మ‌న శ‌రీరానికి అవ‌స‌రమైన ముఖ్య‌మైన విట‌మిన్స్ , మిన‌ర‌ల్స్ అందుతాయి. దీనికి తోడు ప‌లు అనారోగ్య స‌మస్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. పుచ్చకాయ వేసవికాలంలో విరివిగా దొరుకుతూ ఉంటుంది. పుచ్చకాయ దాహం తీర్చడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందులో ఉన్న పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి.అదేవిధంగా చర్మాన్ని పొడిబారకుండా హైడ్రేట్ గా ఉండేలా చేస్తుంది. ఇదిలా ఉంటే పుచ్చకాయ తిన్న వెంటనే మంచి నీళ్లు తాగకూడదు అని అంటూ ఉంటారు.

పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి అని పెద్దలు అంటూ ఉంటారు. అది నిజమే.. మరి పుచ్చకాయ తిన్న తరువాత నీళ్లు తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. పుచ్చకాయ 6 శాతం చక్కెర, 92 శాతం నీరు కలిగి ఉంటుంది. అనగా పుచ్చకాయలు ఎక్కువ శాతం నీరు కలిగి ఉంటాయి.అందువల్ల పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల వాటర్ కంటెంట్ పెరిగి వాంతులు విరేచనాలు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అంతే కాకుండా పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య కలుగుతుంది.

health benefits of watermelon

health benefits of watermelon

Health Benefits  : పుచ్చకాయ తిన్నాక నీళ్లు తాగితే బరువు పెరుగుతారా?

పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్ళు తాగితే శరీరం బరువెక్కడం తోపాటు జీర్ణక్రియ నెమ్మదిగా ప్రారంభమై చక్కెరను జీర్ణం చేయడానికి ఇబ్బంది కలుగుతుంది. కడుపు నొప్పి సమస్య ఉన్న వారు పుచ్చకాయ తిని వెంటనే నీరు తాగడం వల్ల వికారం కలుగుతుంది.అలాగే పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి. అలాగే పుచ్చకాయ నీరు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని కణాల పనితీరు తగ్గుతుంది. ఫలితంగా బలహీనంగా ఉంటారు. పుచ్చకాయను తిన్న తర్వాత నీళ్ళు తాగడం వల్ల బరువెక్కడం తో పాటు జీర్ణక్రియ నెమ్మదిగా ప్రారంభమవుతుంది. పుచ్చకాయ మూత్రవిసర్జన గుణాలు కలిగి ఉన్న పండు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది