Health Benefits : అధిక బరువుతో భాదపడుతున్నారా.. ఎక్కువ నీళ్లు ఉన్న ఈ కాయను తినండి
Health Benefits : సమ్మర్ లో ఎక్కువగా లభించే కీరా దోస…ఎన్నో పోషకాలు నిండి ఉంది. తక్కువ కేలరీలు కలిగి ఉండే కీరదస విటమిన్లు, ఖనిజాలు శరీరంలోని విష పదార్థాలను బయటకి పంపిస్తుంది. దీంతో పాటు చెడు కొలెస్ట్రల్ ని తగ్గించి బరువు కూడా అదుపులో ఉంచుతుంది. కీరా ఆరోగ్యానికే కాదు అందాన్ని పెంచడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే ఎండాకాలంలో అందరూ దీన్ని నేరుగా తీసుకోవడంతో పాటు సలాడ్స్‌లోనూ ఉపయోగిస్తుంటారు. సమ్మర్ లో ఎనర్జీని తిరిగి పొందడానికి కీరా దోస బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఏ, బీ, సీలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
అయితే వీటిని పొట్టు తీయకుండా తింటే మంచి ఫలితాలుంటాయి.కీరాదోసను రెగ్యూలర్ గా సలాడ్స్‌లో భాగం చేసుకుంటే అధిక బరువును తగ్గించవచ్చు. అలాగే కీరదోస కిడ్నీలోని రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది. కళ్ల కింద నల్లటివలయాలు, ఇతర కంటి సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు కళ్లపై కీరదోస ముక్కలను పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. క్యాన్సర్ తో పోరాడే గుణాలు ఎక్కువగా ఉన్న కీరదోస వివిధ రకాల క్యాన్సర్స్ లను నివారించడంలో సహాయపడుతుంది. కీరదోస జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు నాడీవ్యవస్థను సురక్షితంగా ఉంచడానికి తోడ్పడుతుంది. కీరదోసలో ఉంచే పీచు జీర్ణశక్తిని పెంచడంతో పాటు నోటి దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది.
Health Benefits : రెగ్యూలర్ గా తీసుకోవాలె…
కీరదోసలో 90 నుంచి 96 శాతం నీటిని కలిగి వుండడతో పాటు పరిమితంగా కేలరీలను, కొవ్వులు, కొలెస్ట్రాల్, సోడియం కలిగి వుంటుంది. దీంతో అధిక బరువును తగ్గించడానికి ఇది చక్కటి పరిష్కారం చూపిస్తుందిరోజూ నాలుగు కీరదోసముక్కలు తినడం వల్ల ఎసిడిటీ, అల్సర్ ను నివారించవచ్చు. కీరాలో ఎక్కువగా ఉండే విటమిన్ కె మనం తీసుకున్న ఆహారం నుంచి శరీరం ఎక్కువ మొత్తంలో క్యాల్షియం గ్రహించేలా చేస్తుంది. తద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయి. దీనిలో వుండే బి విటమిన్ అడ్రినల్ గ్రంథి పనితీరు మెరుపరుస్తుంది. దీంతో ఒత్తిడి వల్ల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలుగకుండా కాపాడుతుంది.