Health Problems : రాత్రి పూట ఈ పండు తింటే ప్ర‌మాదమే.. వాళ్లు అస్స‌లు తిన‌కూడ‌దు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Problems : రాత్రి పూట ఈ పండు తింటే ప్ర‌మాదమే.. వాళ్లు అస్స‌లు తిన‌కూడ‌దు

 Authored By mallesh | The Telugu News | Updated on :12 April 2022,7:40 am

Health Problems : వేస‌వి తాపాన్ని త‌ట్టుకోవ‌డానికి స‌మ్మ‌ర్ లో చాలా మంది వాట‌ర్ మిల‌న్ ఎక్కువ‌గా తింటారు. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. పైగా టేస్టీగా ఉండ‌టంతో పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా వాటర్ మిలన్ ను లాగించేస్తారు. పుచ్చకాయ అనేది కేవలం డీ హైడ్రేషన్ రాకుండా చేయడమే కాకుండా..మనిషికి అవసరమైన శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను, విటమిన్లను అందిస్తుంది. అందుకే పుచ్చకాయ వేసవిలో అద్భుతమైన ఫ్రూట్ అంటారు. ఎందుకంటే వేసవిలో ఎండల తీవ్రత పెరిగే కొద్దీ ఆకలి తగ్గడం, బాడీలో నీటి శాతం తగ్గిపోవడం వంటివి తలెత్తుతుంటాయి.

సహజసిద్దమైన యాంటీ ఆక్సిడెంట్లకు పుచ్చకాయ ప్రసిద్ధి. ఇందులో లైకోపీన్, ఆస్కార్బిక్ యాసిడ్, సిట్రిలిన్ పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల గుండెపోటు, కేన్సర్ వంటి క్రానిక్ వ్యాధుల్నించి కూడా రక్షించుకోవచ్చు. పుచ్చకాయను ఎలా తీసుకున్నా ఫరవాలేదు. నేరుగా తినవచ్చు లేదా జూస్ చేసుకుని తాగవచ్చు. లేదా ఇతర పండ్లు కీరా, మామిడి, కేరట్, ఆరెంజ్‌తో కలిపి కూడా తీసుకోవచ్చు.అయితే పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, డయేరియా లేదా కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఫ్రక్టోజ్ అనేది మోనోశాకరైడ్ లేదా సాధారణ చక్కెర, దీని అధిక వినియోగం పొట్ట‌లో ఉబ్బరం కలిగిస్తుంది.

Health Problems in Watermelon

Health Problems in Watermelon

Health Problems : ఎక్కువ తింటే ఈ స‌మ‌స్య‌లు ఖాయం

అలాగే పుచ్చకాయ అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) ఆహారం. దీని క్రమరహిత వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. డ‌యాబెటిస్ ఉన్న వారు ఎక్కువ‌గా తీసుకోకుడ‌దు. అలాగే పుచ్చకాయ ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల‌న చర్మం యొక్క రంగు మారుతుంది. దీన్ని లైకోపెనీమియా అని పిలుస్తారు. ఇది ఒక రకమైన కెరోటినిమియా. లైకోపీన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం పిగ్మెంటేషన్‌లో మార్పులు వస్తాయి.కాగా పుచ్చ‌కాయ‌ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కానీ ఇందులో చాలా సహజమైన చక్కెర ఉంటుంది. షుగర్ కంటెంట్ అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు.అయితే రాత్రిపూట జీర్ణవ్యవస్థ నెమ్మదిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సమస్య వస్తుంది. అందుకే డే టైంలో తీసుకుంటే ఏం కాద‌ని నైట్ టైంలో మాత్రం అస్స‌లు తీసుకోకూడ‌ద‌ని సూచిస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది