Health Tips : చాలా మందికి బెల్లం అంటే ఇష్టం ఉంటుంది. ఆరోగ్యం గురించి ఆలోచించే ప్రతీ ఒక్కరి ఇంట్లో బెల్లం తప్పని సరిగా ఉంటుంది. ఎందుకంటే బెల్లం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా వరకు తెలిసే ఉంటుంది. అయితే… ప్రతీ రోజు ఉదయం ఒక గ్లాసు గోరు వెచ్చటి నీళ్లు తాగడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత స్థిరీకరిస్తుంది. అంతే కాకుండా జీవ ప్రక్రియను పునరుద్ధరిస్తుంది. మరియు టాక్సిన్స్ వంటి వ్యర్థాలను తొలగిస్తుంది. ఈ నీటితో పాటు కాస్తంత బెల్లం ముక్కను తినడం వల్ల మరిన్ని లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయాన్నే గోరు వెచ్చటి నీటితో పాలు బెల్లం తీసుకోవడం వల్ల పొట్ట క్లియర్ అవుతుందట. జీర్ణక్రియ కూడా చాలా వరకు మెరుగుపడుతుందట. అలాగే ఎసిడిటీ, మలబద్ధకం వంటిటి చిటికెలో తగ్గిపోతాయట.
అంతే కాదండోయ్ శరీరంలోని పలు రకాల స్రావాల విడుదలకు కూడా సాయపడుతుంది. దాని వల్ల బరువు పెరగడానికి కారణం అయ్యే మూల కారకాన్ని దూరంగా ఉంచుతుంది. నివారణకు ఆయుర్వేదంలో కూడా సాక్షం ఉంది.మన పూర్వీకులు నుండి ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటితో పాటు చిన్న బెల్లం ముక్క తినడం ఆనవాయితీగా వస్తోంది. ఆయుర్వేదం ప్రకారం… గోరువెచ్చని నీటితో పాటు బెల్లం తింటే జీర్ణ ఎంజైమ్ లు పెరిగి. జీర్ణక్రియ వేగవంతం అవుతుందట. అలాగే కడ్నీ సంబంధిత వ్యాధులు దూరం అవుతాయట. బెల్లంలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటామిన్ బీ1, బీ6 మరియు సీ లు టాక్సిన్లను తొలగిస్తాయట. ఇందులో ఫైబర్ కూడా ఉండటం వల్లే జీర్ణక్రియ మెరుగుపడుతుందట. అలాగే ఇందులో ఉండే పొటాషియం కంటెంట్ శరీరంలోని ఎలక్ర్టోలైట్ మరియు మినరల్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.
మెటబాలిజంను కూడా పెంచుతుంది. అంతే కాదండోయ్ మీరు వ్యాయామం చేసేటప్పుడు అధిక మొత్తంలో చెమట వచ్చేందుకు కూడా కృషి చేస్తుంది. అయితే ప్రతిరోజూ వీటిని తాగడం వల్ల బెడ్ టీ, బెడ్ కాఫీ వంటి అలవాట్లను దూరం చేసుకోవచ్చు.మారుతున్న కాలానుగుణందా జలుబు, దగ్గు మరియు ఫ్లూ వంటి వాటిని తగ్గించడంలో కూడా బెల్లం ముందుంటుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే కచ్చితంగా ప్రతీ రోజు చిన్న బెల్లం ముక్కును తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అంటు వ్యాధులను నిరోధించేందుకు కూడా బెల్లం ఎంతగానో సహాయ పడుతుంది. అందువల్ల ప్రతీరోజూ ఉదయం గోరు వెచ్చని నీటితో పాటు కాస్త బెల్లం ముక్కని కూడా నోట్లో వేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి మరి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.