Health Tips : మీరు బెల్లం తింటారా.. అయితే దీని గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : మీరు బెల్లం తింటారా.. అయితే దీని గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Health Tips : చాలా మందికి బెల్లం అంటే ఇష్టం ఉంటుంది. ఆరోగ్యం గురించి ఆలోచించే ప్రతీ ఒక్కరి ఇంట్లో బెల్లం తప్పని సరిగా ఉంటుంది. ఎందుకంటే బెల్లం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా వరకు తెలిసే ఉంటుంది. అయితే… ప్రతీ రోజు ఉదయం ఒక గ్లాసు గోరు వెచ్చటి నీళ్లు తాగడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత స్థిరీకరిస్తుంది. అంతే కాకుండా జీవ ప్రక్రియను పునరుద్ధరిస్తుంది. మరియు టాక్సిన్స్ వంటి వ్యర్థాలను తొలగిస్తుంది. ఈ […]

 Authored By pavan | The Telugu News | Updated on :9 March 2022,3:00 pm

Health Tips : చాలా మందికి బెల్లం అంటే ఇష్టం ఉంటుంది. ఆరోగ్యం గురించి ఆలోచించే ప్రతీ ఒక్కరి ఇంట్లో బెల్లం తప్పని సరిగా ఉంటుంది. ఎందుకంటే బెల్లం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా వరకు తెలిసే ఉంటుంది. అయితే… ప్రతీ రోజు ఉదయం ఒక గ్లాసు గోరు వెచ్చటి నీళ్లు తాగడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత స్థిరీకరిస్తుంది. అంతే కాకుండా జీవ ప్రక్రియను పునరుద్ధరిస్తుంది. మరియు టాక్సిన్స్ వంటి వ్యర్థాలను తొలగిస్తుంది. ఈ నీటితో పాటు కాస్తంత బెల్లం ముక్కను తినడం వల్ల మరిన్ని లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయాన్నే గోరు వెచ్చటి నీటితో పాలు బెల్లం తీసుకోవడం వల్ల పొట్ట క్లియర్ అవుతుందట. జీర్ణక్రియ కూడా చాలా వరకు మెరుగుపడుతుందట. అలాగే ఎసిడిటీ, మలబద్ధకం వంటిటి చిటికెలో తగ్గిపోతాయట.

అంతే కాదండోయ్ శరీరంలోని పలు రకాల స్రావాల విడుదలకు కూడా సాయపడుతుంది. దాని వల్ల బరువు పెరగడానికి కారణం అయ్యే మూల కారకాన్ని దూరంగా ఉంచుతుంది. నివారణకు ఆయుర్వేదంలో కూడా సాక్షం ఉంది.మన పూర్వీకులు నుండి ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటితో పాటు చిన్న బెల్లం ముక్క తినడం ఆనవాయితీగా వస్తోంది. ఆయుర్వేదం ప్రకారం… గోరువెచ్చని నీటితో పాటు బెల్లం తింటే జీర్ణ ఎంజైమ్ లు పెరిగి. జీర్ణక్రియ వేగవంతం అవుతుందట. అలాగే కడ్నీ సంబంధిత వ్యాధులు దూరం అవుతాయట. బెల్లంలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటామిన్ బీ1, బీ6 మరియు సీ లు టాక్సిన్లను తొలగిస్తాయట. ఇందులో ఫైబర్ కూడా ఉండటం వల్లే జీర్ణక్రియ మెరుగుపడుతుందట. అలాగే ఇందులో ఉండే పొటాషియం కంటెంట్ శరీరంలోని ఎలక్ర్టోలైట్ మరియు మినరల్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

Health Tips all the people know real facts about jiggery

Health Tips all the people know real facts about Jaggery

మెటబాలిజంను కూడా పెంచుతుంది. అంతే కాదండోయ్ మీరు వ్యాయామం చేసేటప్పుడు అధిక మొత్తంలో చెమట వచ్చేందుకు కూడా కృషి చేస్తుంది. అయితే ప్రతిరోజూ వీటిని తాగడం వల్ల బెడ్ టీ, బెడ్ కాఫీ వంటి అలవాట్లను దూరం చేసుకోవచ్చు.మారుతున్న కాలానుగుణందా జలుబు, దగ్గు మరియు ఫ్లూ వంటి వాటిని తగ్గించడంలో కూడా బెల్లం ముందుంటుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే కచ్చితంగా ప్రతీ రోజు చిన్న బెల్లం ముక్కును తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అంటు వ్యాధులను నిరోధించేందుకు కూడా బెల్లం ఎంతగానో సహాయ పడుతుంది. అందువల్ల ప్రతీరోజూ ఉదయం గోరు వెచ్చని నీటితో పాటు కాస్త బెల్లం ముక్కని కూడా నోట్లో వేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి మరి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది