Health Tips : ఆలుగడ్డ తొక్క తీసి కుక్ చేయడం వలన నష్టాలు ఏంటో తెలుసా.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : ఆలుగడ్డ తొక్క తీసి కుక్ చేయడం వలన నష్టాలు ఏంటో తెలుసా.?

Health Tips : కొన్ని కూరగాయలను పొట్టు తీసి పడేసి లోపలి పదార్థాన్ని వండుతూ ఉంటారు. అయితే కూరగాయలైన, పప్పు దినుసులైన ఏవైనా సరే తొక్కలో ఉండే పోషక విలువలు అందరికీ తెలిస్తే వాటిని పడేయరు. అలాగే ఇప్పుడు ఆలుగడ్డ దానిని కూడా తొక్క తీసే వండుతూ ఉంటాం. ఆలుగడ్డ మట్టిలో నుంచి బయటికి వస్తుంది. కాబట్టి దానికి మొత్తం మట్టి ఉంటుంది. ఆ మట్టి కారణంగా దాని తొక్కని తీసి కుక్ చేస్తూ ఉంటారు. అయితే […]

 Authored By aruna | The Telugu News | Updated on :26 September 2022,7:30 am

Health Tips : కొన్ని కూరగాయలను పొట్టు తీసి పడేసి లోపలి పదార్థాన్ని వండుతూ ఉంటారు. అయితే కూరగాయలైన, పప్పు దినుసులైన ఏవైనా సరే తొక్కలో ఉండే పోషక విలువలు అందరికీ తెలిస్తే వాటిని పడేయరు. అలాగే ఇప్పుడు ఆలుగడ్డ దానిని కూడా తొక్క తీసే వండుతూ ఉంటాం. ఆలుగడ్డ మట్టిలో నుంచి బయటికి వస్తుంది. కాబట్టి దానికి మొత్తం మట్టి ఉంటుంది. ఆ మట్టి కారణంగా దాని తొక్కని తీసి కుక్ చేస్తూ ఉంటారు. అయితే అలా తీసేయడం వలన ఎన్ని నష్టాలు మీకు తెలుసా.. మన శరీరానికి కావలసిన ఎన్నో పోషక విలువలు ఆ పొట్టు లోంచి పోతాయో కూడా మీకు తెలిసి ఉండదు.. ఆ పోషిక విలువలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1) ఈ ఆలుగడ్డలు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు, గ్లైకో ఆల్కలాయిడ్స్, పాళీ పెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్ లోని కొలెస్ట్రాన్ని కంట్రోల్ చేస్తాయి. 2) బంగాళదుంప తొక్కలోని విటమిన్ సి అధికంగా ఉంటుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్, కాలుష్యం విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కావున ఆలుగడ్డ తొక్క తీసి వండుకోవడం కంటే తొక్కతోనే వండుకోవడం మంచిది. 3) ఆలుగడ్డలు తొక్కతో తీసుకోవడం వలన గుండెపోటు లాంటివి వచ్చి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. 4) ఈ తొక్కలో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, ఫాస్పరస్, రాగి, జింకు, క్యాల్షియం, పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి అందవలసిన ముఖ్యమైన పోషకాలు.

Health Tips disadvantages of cooking peeled potatoes

Health Tips disadvantages of cooking peeled potatoes

5) ఈ బంగాళదుంప అందానికి కూడా దీని తొక్కలు చాలా సహాయపడతాయి. దీనిలో ఫినాలేక్, ఆంటీ యాక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ తొక్కలు మొటిమలు మచ్చలున్న చోట రుద్దితే మంచి బ్లీచ్ల పని చేస్తాయి. 6) ఆలుగడ్డ తొక్క నుంచి తీసిన రసంతో తలకు మసాజ్ చేసుకుంటే జుట్టు స్ట్రాంగ్ గా ఎదుగుతుంది. అదేవిధంగా జుట్టు మెరుస్తుంది. వాస్తవానికి ఆలుగడ్డ వేపుడు లాంటివి తొక్కతో కలిపి చేస్తేనే చాలా రుచిగా ఉంటుంది. కూర ముద్దవ్వకుండా బావుంటుంది. ఆలుగడ్డ తొక్కలను ఎక్కువ మట్టి ,మురికి ఉంది. అనుకుంటే నీటిలో ఒక పావుగంట నానబెట్టి ఆ తర్వాత శుభ్రం చేస్తే అదంతా తొలిగిపోతుంది. 7) ఆలుగడ్డ తొక్కలు పైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఈ ఆలుగడ్డ క్యాన్సర్ రాకుండా రక్షిస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది