Health Tips : యాంటీబయోటిక్స్ తీసుకున్నప్పుడు. మద్యం తాగవచ్చా… డాక్టర్స్ ఏం తెలియజేస్తున్నారంటే.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : యాంటీబయోటిక్స్ తీసుకున్నప్పుడు. మద్యం తాగవచ్చా… డాక్టర్స్ ఏం తెలియజేస్తున్నారంటే.?

 Authored By aruna | The Telugu News | Updated on :12 August 2022,4:00 pm

Health Tips : ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా మందుబాబులే ఎక్కువమంది ఉన్నారు. చాలామంది రాత్రి ఒక త్రాగకపోతే వారికి నిద్ర పట్టదు. ఈ మధ్యం ఆరోగ్యానికి ఎంతో చెడు చేస్తుంది అని తెలిసి కూడా దీనిని తాగక మానరు. అలాగే ఈ మద్యానికి బానిసలుగా మారి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఈ మద్యం గురించి వైద్య నిపుణులు ఇలా తెలియజేశారు. ఆల్కహాల్ కి తీసుకోకపోవడంనేది చాలా మంచిదని అంటున్నారు. అదేవిధంగా కొన్ని వ్యాధులకు సంబంధించి ఇంగ్లీష్ మందులను వాడుతూ ఉంటారు. అలాంటి మందులలో యాంటీబయోటిక్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా యాంటీబయటిక్ తీసుకున్నప్పుడు. ఈ ఆల్కహాలను తీసుకోవడం అనేది ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

అలా తీసుకోవడం వలన అనేక రకాల వ్యాధుల బారిన పడటం ఖాయం అని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఈ యాంటిబయోటిక్ గోలీలను తీసుకున్నప్పుడు మద్యం తాగొద్దని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. యాంటీబయోటిక్ టాబ్లెట్లు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. టినిడాజోల్: ఈ యాంటీబయాటిక్ టాబ్లెట్ ఇది ఎక్కువగా పేగు సంబంధించిన వ్యాధులకు అలాగే కొన్ని ఇన్ఫెక్షన్లకు సహాయపడుతుంది. ఈ టాబ్లెట్ తీసుకున్నప్పుడు మద్యం సేవించినట్లయితే రక్తపోటులో హెచ్చుతగ్గులు, ఊపిరాడకపోవడం, తలనొప్పి వాంతులు వికారం లాంటి ఇబ్బందులకి గురవుతారు.

Health Tips For Drinking when Take Antioxidants

Health Tips For Drinking when Take Antioxidants

మెట్రో నిడాజోల్ : ఈ టాబ్లెట్లను ఎక్కువగా దంతా సంబంధించిన వ్యాధులకు అలాగే రోసేసియా, కాలయంలో జొరబడిన బ్యాక్టీరియాలను సంహరించేందుకు సహాయపడుతుంది. ఈ టాబ్లెట్ ను తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకున్నట్లయితే.. తలనొప్పి వికారం కడుపునొప్పి వాంతులు లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా సెపోటేటన్, సల్ప మేథో క్స జోన్, లినేజోలిడ్ అనే యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు ఈ ఆల్కహాల్ ను తీసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులకి గురవుతారు. కాబట్టి ఈ ఆల్కహాల్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని వైద్యని పనులు చెప్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది