Health Tips : సోమరితనం పోవాలంటే ఏం చేయాలి…?
Health Tips : జీవితంలో మంచి కెరీర్ ను, విజయాలను ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చాలామంది ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు వెళతారు. అయితే కొన్ని కొన్ని విషయాల అలాంటి వారిని ఆపేస్తాయి. అలాంటి వారిలో సోమరితనం అతిపెద్ద అడ్డంకిగా మారుతుంది. ఒక్కోసారి మనకు అన్నీ తెలిసిన ఏమీ చేయకుండా ఉంటాం. ఎక్కువ నిద్రపోవడం వలన హాని కలుగుతుందని తెలుసు. మొబైల్స్ ఎక్కువగా చూడకూడదని తెలుసు. అయినా వాటిని ఏమాత్రం పట్టించుకోము. సోమరితనం, బద్ధకం లాంటివి ఎలాంటి పనులు చేయనీయవు. దీని వలన పెద్ద నష్టాలే జరగవచ్చు. అయితే సోమరితనం నుంచి బయటపడడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
సోమరితనం పోవడానికి ప్రొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేయాలి. ఇలా చేయడం వలన రోజంతా యాక్టివ్ గా ఉంటారు. సోమరితనం అనేది శరీర అలసట, మానసిక అలసట వలన వస్తుంది. సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వలన శరీరం అలిసిపోతుంది. దీంతో సోమరితనం మొదలవుతుంది. అందుకే పోషకాలు గల తాజా ఆహారాన్ని తీసుకోవాలి. సోమరితనానికి మరొక కారణం సరైన రీతులో కూర్చోకపోవడం, నిద్ర పోకపోవడం. నడిచేటప్పుడు రెండు కాళ్లు సమన్వయంగా ఉండాలి. కూర్చున్నప్పుడు పద్మాసనం లాగా కూర్చోవాలి.
పగటిపూట నిద్ర కూడా మంచిది కాదు. రాత్రిపూట కంటి నిండా నిద్రపోతే మధ్యాహ్నం నిద్ర పోకుండా ఉంటారు. నిద్ర అనేది మనిషికి కొత్త శక్తిని ఉత్తేజాన్ని ఇస్తుంది. అందుకే నిద్ర అనేది అందరికీ అవసరం. పొద్దున్నే ఆలస్యంగా లేచిన సోమరితనం అనేది వస్తుంది. అందుకే రాత్రిపూట తొందరగా పడుకొని ఉదయాన్నే తొందరగా లేస్తే శరీరం యాక్టివ్ గా ఉంటుంది. సోమరితనాన్ని, బద్దకాన్ని వదిలించుకోవాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవడం, సరైన రీతిలో పడుకోవడం, కూర్చోవడం, ఉదయాన్నే తొందరగా లేవడం చేస్తే సోమరితనం పోతుంది.