Leafs Remedy : వేసవిలో ఈ ఆకుకూరలతో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది… గుండె, కామెర్ల వ్యాధులకు చెక్కు…
Leafs Remedy : ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని వృక్షాలు, కొన్ని చెట్లు ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. అన్ని వృక్షాలలో కెల్లా ఈ వృక్షం, ఆక్సిజన్ ని ఇవ్వడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. చెట్లతో పోలిస్తే ఇది 24 గంటలు ఆక్సిజన్ విడుదల చేయగలదు. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. టానిక్ యాసిడ్, ఆస్పార్టిక్ యాసిడ్, ఫ్లేవ నాయుడ్లు, స్టెరాయిడ్స్, విటమిన్లు, మెతియోనిన్, గ్లైసిన్ వంటి పోషకాలు ఇందులో కనిపిస్తాయి. అందుకే దీని ఆకులు, బెరడు, విత్తనాలను అనేక రకాల సమస్యలకు చికిత్సను అందించడానికి వినియోగిస్తారు. 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రస్తుతం పతంజలి ఆయుర్వేద చార్యగా పనిచేస్తున్న భువనేష్ పాండే… వేసవిలో రావి (peepal ) ఆకులను షిషమ్ ( ఇంగ్లీషులో sheesham, sisam, Rosewood, sissoo plant ), బెల్ ( పులావులో వేసే బెల్ ఆకులు), ఆకులతో కలిపి ఉపయోగిస్తే, మండే ఎండల్లో కూడా శరీరం చల్లదనాన్ని పొందుతుందని తెలిపారు. మిశ్రమంతో.. ల్యూకేరియా, తెల్లటి ఉత్సర్గ, అధిక చమట, పిత్త సమస్యలు, కు నుండి రక్తం కారడం వంటి సమస్యల నుంచి పూర్తి ఉపశమనం పొందవచ్చని చెప్పారు.

Leafs Remedy : వేసవిలో ఈ ఆకుకూరలతో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది… గుండె, కామెర్ల వ్యాధులకు చెక్కు…
Leafs Remedy ఈ ఆకులతో ఔషధాన్ని ఎలా తయారు చేయాలి
వేసవిలో ఆరోగ్య సంబంధిత సమస్యలను నయం చేయడానికి రావి, షిషమ్, బెల్ ఆకులు చాలా ప్రభావంతంగా ఉంటాయి. ఆయుర్వేదచార్య భువనేష్ లోకల్ 18కి ఈ మిశ్రమం ఎలా తయారు చేయాలో తెలిపారు. ఒక గ్లాస్ నీటిలో 15 మెత్తని రావి ఆకులను పూర్తిగా మరిగించాలి. మీరు మూడో వంతు మాత్రమే మిగిలే వరకు మరిగించాలని చెప్పారు. తరువాత దానిని చల్లబరిచి, ప్రతి మూడు గంటలకు ఒకసారి కొద్దిగా తాగండి, చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదం తగ్గుతుంది, ఇంకా, కామెర్లతో బాధపడుతూ ఉంటే, 5 మృదువైన రావి ఆకులతో కషాయాన్ని సిద్ధం చేసుకోండి అని భువనేసి తెలిపారు. మరి, ఈ కషాయానికి ఇంకా ఏం కలపాలో కూడా వివరించారు. ఈ కషాయంలో పసుపు, చెక్కర వేసి రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. చేయడం ద్వారా మీరు కామెర్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అని తెలిపారు. వేసవికాలంలో మీరు రావి ఆకులు,షీషమ్ ఆకులు, బెల్ ఆకులు కలిపి తయారుచేసిన కషాయాన్ని తీసుకుంటే.. మధ్యాహ్నం మండే ఎండల్లో కూడా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వస్తుంది. శరీరం లోపల నుంచి చల్లగా ఉండడానికి ఇది దోహదపడుతుంది. ఎందుకంటే, పుదీనా తరహా లోనే.. ఈ ఆకుల్లో కూడా.. శరీరాన్ని చల్లగా ఉంచే గుణాలు ఉన్నాయని తెలిపారు.
Leafs Remedy ఈ ఆకులు క్యాన్సర్ కు దివ్య ఔషధం
లుకేమియా ( క్యాన్సర్), తెల్లటి ఉత్సర్గ , అధిక చమట, పిత్త పెరుగుదల, ముక్కు నుండి రక్తశ్రావం వంటి సమస్యల నుంచి పూర్తి ఉపశమనం పొందాలంటే… ఈ మూడు ఆకుల కషాయం.. కొద్ది కొద్దిగా మూడు గంటలకు ఒకసారి తాగాలని ఆయుర్వేద ని పునులు తెలిపారు. తద్వారా క్రమంగా ఈ అనారోగ్యాలు తగ్గిపోతాయని వివరించారు.
ఆయుర్వేద నిపుణులు తెలియజేసిన విషయము. రావి ఆకులు చాలా చేదుగా ఉంటాయని తెలిపారు. అందువల్ల, మీరు తక్కువ నీటితో ఈ ఆకులు కషాయాన్ని తయారు చేస్తే.. 3 నుంచి 5 రావి ఆకులను మాత్రమే వాడాలని గుర్తుంచుకోండి.ఈ కషాయాన్ని 2 నుంచి 3 సార్లు తీసుకోవాలి. ఈ ఆకులను పొడిగా చేసుకుంటే.. రోజు మొత్తంలో రెండున్నర నుంచి 5 గ్రాములు మాత్రమే తినండి. ఇంతకుమించి ఎక్కువ మోతాదు వద్దు అని నిపుణులు సూచించారు. ఈ 3 మొక్కలు మీరు పెంచాలి అనుకుంటే.. మీకు నర్సరీలో లభిస్తాయి.