Home » Health » Health Tips These Drink Tighten The Stomach After Delivery
Health

Health Tips : ఈ కషాయం త్రాగారంటే… డెలివరీ తర్వాత వచ్చే పొట్ట తగ్గిపోతుంది…

Authored By
aruna
The Telugu News | Published on: August 18, 2022, 4:00 pm
Advertisement

Health Tips : చాలామంది మహిళలకు డెలివరీ అయ్యాక పొట్ట లావుగా కనిపిస్తుంటుంది. డెలివరీ అయ్యాక పొట్ట, నడుము భాగంలో కొవ్వు పెరిగిపోవడం వలన లావుగా కనిపిస్తుంటారు. దాంతో కొందరు అసహ్యంగా భావించి నలుగురిలో కలవడానికి, బయటకు వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. పెరిగిన పొట్టను తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే సరైన ఫలితం ఉండదు. కొంతమంది పొట్ట తగ్గటానికి విపరీతంగా డైటింగ్ చేస్తూ ఉంటారు. కానీ పొట్ట తగ్గకుండా నీరసం, నిస్సత్తువా రావటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతుంటారు.

Advertisement

పొట్ట తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. డెలివరీ తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకోవడానికి చాలా సులభమైన చిట్కాలను ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. మన వంటింట్లోనే లభించే కొన్ని రకాల మసాలా దినుసులతో పొట్టను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందులో భాగంగా యాలకుల సొంపుతో కలిసి చేసే కషాయం కూడా డెలివరీ తర్వాత వచ్చే పొట్టను తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ఇందుకోసం ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు, నాలుగు యాలకులు, ఒక స్పూన్ సోంపు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి పరిగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. ఈ విధంగా పరిగడుపున తాగితే జీవక్రియ రేటు పెరిగి పొట్టలో కొవ్వు కరిగిపోతుంది.

Health Tips these drink tighten the stomach after delivery

Advertisement

ఈ కాషాయం వలన పొట్టలో కొవ్వు కరిగిపోవడమే కాకుండా తల్లిపాలను పెంచడంలోనూ ఈ కషాయం ఎంతగానో సహాయపడుతుంది. ఈ నీటిని త్రాగిన పది నిమిషాల తర్వాత పొట్ట మీద నువ్వుల నూనె రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కాపడం పెట్టుకోవాలి. దాంతో పొట్ట మీద కండరాలు టైట్ గా మారుతాయి. ఇలా చేయడం వలన డెలివరీ తర్వాత వచ్చే పొట్ట ఈజీగా తొలగిపోతుంది. ఆ తర్వాత పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేసి అనంతరం స్నానం చేయాలి. ఇలా ప్రతిరోజు చేయడం వలన కొద్ది రోజుల్లోనే పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వు కరిగి నడుం సన్నబడుతుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి