Home » Entertainment » Hyper Aadi Adventure To Shraddha Das Ks
Entertainment

Hyper Aadi : ఆ పని చేస్తే ముద్దు ఇస్తానన్న శ్రద్దా దాస్.. తెగించేసిన హైపర్ ఆది

Authored By
aruna
The Telugu News | Updated on: August 18, 2022 2:45 pm
Advertisement

Hyper Aadi : ఢీ షోలంటే డ్యాన్సులు తప్పా మిగతా అన్నీ ఉంటాయని అందరికీ తెలిసిందే. డ్యాన్స్ షో నుంచి కామెడీ షోగా రూపాంతరం చెందిందన్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఢీ షోలో డ్యాన్సులు కాస్తా జిమ్నాస్టిక్స్, సర్కస్ ఫీట్లుగా మారాయి. ఇక ఇప్పుడు ఆ సర్కస్ ఫీట్లు కాస్తా కామెడీ ట్రాకులు, లవ్ ట్రాకుల్లా మారాయి. ఢీ షో ఎప్పుడో గతి తప్పింది. ఒకప్పుడు ఢీ షోకి ఉన్న బ్రాండ్ ఇప్పుడు లేదు. అందులోనూ కామెడీని జొప్పించి నానా రకాలుగా చెడగొట్టేశారు. ఆది, ప్రదీప్, ఇలా అందరూ చేరి కామెడీ షోగా మార్చేశారు.

Advertisement

ఇక ఇందులో జడ్జ్‌లు అయితే కనీసం మెయింటైన్ చేయరు. వాళ్లసలు జడ్జ్‌లా అన్నట్టుగా ఉంటారు. ఒకప్పుడు తరుణ్ మాస్టర్ కాలంలో ఎంత హుందాగా ఉండేవారు. ఇప్పుడు మాత్రం పనీ పాట లేకుండా ఖాళీగా ఉండే హీరోయిన్లను పట్టుకొస్తున్నారు. జడ్జ్ స్థానంలో పెడుతున్నారు. వాళ్లకు డ్యాన్సులకు ఏం సంబంధమో ఢీ టీంకే తెలియాలి. ఇప్పుడు ప్రియమణి వెళ్లిపోయింది. ప్రియమణి ఉన్న సమయంలో బావా అంటూ ఆదితో చేసే రొమాన్స్ ఎవ్వరూ చూడలేకపోయారు. ఇక ఇప్పుడు శ్రద్దా దాస్ తోడైంది.

Hyper Aadi Adventure to Shraddha Das KS

Advertisement

Hyper Aadi : ముద్దు కోసం ఆది కష్టాలు..

శ్రద్దాదాస్ కూడా మరింత రెచ్చిపోతోంది. కంటెస్టెంట్లకు హగ్గులు, కిస్సుులు అంటూ పూర్ణ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. పూర్ణ కూడా ఇంతే తనకు ఏవైనా డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు నచ్చితే చాలు వచ్చి హగ్గులు ఇవ్వడం, బుగ్గలు కొరకడం అలవాటుగా ఉండేది. ఇక ఇప్పుడు శ్రద్దా దాస్ హగ్గులు, ఆమె ముద్దుల కోసం ఆది తెగ పరితపిస్తున్నట్టున్నాడు. ఆదికి ముద్దు ఇచ్చేందుకు శ్రద్దా దాస్ రెడీ అయింది. కాక పోతే అందుకు ఓ సాహసం చేయాలనేకండీషన్ పెట్టింది. నిమిషం పాటు మంచు గడ్డ మీద నిలబడాలనే టాస్క్ ఇచ్చింది. ఇక దాని కోసం ఆది తెగించాడు. మంచు గడ్డ మీద నిల్చున్నాడు. కానీ ఎనర్జీ కోసం ముందుగా హాఫ్ కిస్ ఇవ్వొచ్చు కదా? అని బేరాలు ఆడాడు. అలా మొత్తానికి ఆది అయితే శ్రద్దా దాస్ ముద్దు కోసం మంచు గడ్డ మీద నిల్చున్నాడు. గడ్డ కట్టి పోతోన్నా కూడా పాటలు పాడుతూ ఏదో అలా మ్యానేజ్ చేసేశాడు ఆది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి