Health Tips : అధిక బరువును తగ్గించుకోవాలని అనుకుంటున్నారా…? అయితే వీటిని తినండి..
Health Tips : ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీని ముఖ్యంగా వారి లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, టైంకు భోజనం చేయకపోవడం వంటివే కారణం. వీటి వల్ల ఒబేసిటి వంటి సమస్యలు ఎదురవుతాయి. అధిక బరువు ఉన్న వారిలో మధుమేహం, గుండె జబ్బులతో పాటు జాయింట్ పెయిన్స్, బీపీ వంటి సమస్యలు ఎక్కువ తలెత్తుతాయి. ఏ పని చేయాలన్నా బాడీ సహకరించదు. ప్రతి చిన్న పనికీ నీరసం వస్తుంది. ఇలాంటి వారు టైంకు భోజనం చేయడం, వ్యాయామం చేయడం వల్ల సమస్యను కొంత మేరకు తగ్గించుకోవచ్చు.
కానీ ప్రస్తుతం బిజీ లైఫ్‌లో ఇలాంటి వాటిని పాటించడం కాస్త కష్టమనే చెప్పాలి.ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.నల్ల జీలకర్రతో బాడీకి చాలా ఉపయోగాలు చేకూరుతాయి. ఇది అచ్చం గోధుమ రంగులో ఉంటుంది. కొంచెం పొడవుగా ఉంటుంది. చాలా మంది నల్ల జీలకర్రను అనుకుని కలొంజి విత్తనాలను ఇస్తూ ఉంటారు. శరీరానికి లాభం చేకూర్చే వాటిలో అవిస గింజలు ఒకటి. అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. రెండు చెంచాల నల్లజీలకర్రను, రెండు చెంచాల అవిస గింజలను రెండు నిమిషాల పాటు వెయించాలి.
Health Tips : నల్ల జీలకర్రతో చెక్..
ఇలా చేయడం వల్ల అందులోని తేమ ఆవిరైపోతుంది. ఫలితంగా మనం తయారు చేసుకోబోయే పౌడర్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. వేయించిన గింజలను మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి. అవి పిండిలాగా మారే వరకు మిక్సీ పట్టాలి. దీనికి అర చెంచా సైంధవ లవణాన్ని కలపాలి. ఇలా తయారు చేసుకున్న పౌడర్ ను ప్రతి రోజు నీటిలో కలిసి తాగడం వల్ల బాడీలో మెటబాలిజనం శాతం పెరుగుతుంది. దీని వల్ల కొవ్వును కరిగిపోతుంది. వీటిలో పోషకాలు సైతం ఎక్కువగానే ఉంటాయి.