Heart Attack : ప్రస్తుతం చాలామందికి గుండెపోటు వచ్చి చనిపోతున్నారు.. అది కూడా చిన్న వయసులోనే.. అయితే అందరూ మగవారిలో అధికంగా గుండెపోటు వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఇది మాత్రం వాస్తవం కాదు.. ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా పిల్లలు పెద్దలు యువతని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది. అలాగే ఇటీవల స్త్రీలలో ఎక్కువగా కనపడుతుంది. గుండెపోటు ప్రతి ఏటా ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు గుండె జబ్బుతో మరణిస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. 10 సంవత్సరాలలో 30 శాతం పెరుగుదల… గత పది సంవత్సరాల కాలంతో పోలిస్తే 35 నుండి 45 ఏళ్లలోపు వయసుగల వారిలో గుండెపోటుకు గురైన వారి సంఖ్య 30% అధికమైనట్లు తెలుస్తోంది.
అయితే గుండెపోటు లక్షణాలు పురుషుల మాదిరి కాకుండా మహిళల్లో కాస్త భిన్నంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణం ప్రభావం, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు శారీరిక మానసిక ఒత్తిడి లాంటివి స్త్రీలలో గుండెపోటుకి దారితీస్తున్న ముఖ్యమైన ప్రధాన కారణాము.. గుండెపోటు వచ్చే ముందు ఏం జరుగుతుందో తెలుసా..? గుండెపోటు వచ్చే ముందు సంకేతాలను బట్టి జాగ్రత్త పడవచ్చు.. అయితే మగవారితో పోలిస్తే ఆడవారిలో ఈ లక్షణాలు భిన్నంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీవ్రమైన చాతినొప్పి, ఒత్తిడి, వికారం, వాంతులు, మైకం, తల తిరగడం వెన్ను లేదా దవడ నొప్పి, ఒళ్ళంతా చెమటలు పట్టడం అసౌకర్యం కడుపులో ఉబ్బరం గందరగోళం విపరీతమైన అలసట అధికంగా వాంతులు కావడం లక్షణాలతో మొదలయ్యి స్త్రీలలో హార్ట్ ఎటాక్ వస్తుంది.
అందుకే ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉన్న స్త్రీలు ఈ సింటమ్స్ కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలని నిపుణులు చెప్తున్నారు.. ఒత్తిడి ధూమపానం వల్ల కూడా గుండెపోటు… ప్రపంచవ్యాప్తంగా స్త్రీలలో హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్ అధికమవడానికి గల పలు కారణాలలో ధూమపానం ఒత్తిడి కూడా ఉంటున్నాయి. అయితే ఒకప్పటిలా స్త్రీలు ఇప్పుడు ఇంటికే పరిమితం కావడం లేదు. తమ కాళ్ళపై తమ నిలబడాలని కుటుంబాలకు ఆసరాగా నిలబడాలని చాలామంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. మగవారితో పోలిస్తే ఒకవైపు ఇంటి పనులు మరోవైపు ఆఫీసు పని మధ్య అధికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఫ్యామిలీ జాబ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా ఎదుర్కొనే ఒత్తిళ్లు మహిళల ఆరోగ్యం పై ప్రభావం పడుతున్నాయి.చాలామందిలో గుండెపోటుకి దారితీస్తున్నాయి. అరుదుగా కొందరికి స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది. దీర్ఘకాలం ఈ పరిస్థితి కొనసాగితే శరీరంలో ట్రైగ్లిజరిన్ పెరిగి రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అయి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.