Tooth Brush : మీ టూత్ బ్రష్‌ను ఎన్నిరోజులుగా వాడుతున్నారు..? ఇది మీకోసమే!
Tooth Brush : టూత్ బ్రష్‌ను కొందరు చాలా రోజులు వాడుతుంటారు. దాని బ్రెస్సెల్స్ అరిగిపోయేంత వరకు వాడుతుంటారు. అలా వాడితే మంచిదా? దంత సమస్యలతో పాటు ఆరోగ్యంపై ఎదైనా ప్రభావం పడుతుందా? కొవిడ్ ప్రమాదకారి సమయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. టూత్ బ్రష్ ప్రతి మూడు నెలలకు ఒకసారి మార్చకుండా కంటిన్యూగా వాడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..టూత్ బ్రష్ విషయంలో కొందరు మరీ పిసినారీగా వ్యవహరిస్తుంటారు. ఒక్క బ్రష్‌ను ఆరు నెలల నుంచి ఏడాది వరకు వాడుతుంటారు. దాని బ్రెస్సెల్స్ అరిగిపోయాక కూడా వాడుతుంటారు. అలా వాడటం ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎప్పుడైన ఒక టూత్ బ్రష్‌ను మూడు నెలల కంటే ఎక్కువగా వాడరాదట.. ఎందుకంటే బ్రెస్సెల్స్ ప్లాస్టిక్‌తో తయారవుతుంది. వాటిలో ఒకానొక టైం దాటాక అందులోని ప్లాస్టిక్ బ్రష్ నోట్లో పెట్టుకుని నమలడం వలన శరీరంలోకి వెళ్లిపోతుంది. దాని వలన కడపు సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా కొందరు వాష్ రూంలో బ్రషెస్ పెడుతుంటారు. అలా అస్సలు పెట్టుకూడదు. బాత్రూంలో వేలాది జెమ్స్ ఉంటాయి. బొద్దింకలు వంటివి కూడా తిరుగుతుంటాయి. అవి టూత్ బ్రష్‌ల మీద వాలచ్చు.ఉదయం లేవగానే కొందరు నేరుగా బ్రష్ వాష్ చేయకుండా పేస్ట్ పెట్టుకుని నోట్లో పెట్టేసుకుంటారు.

how many days have you been using your toothbrush
Tooth Brush : టూత్ బ్రష్ మార్చితేనే మంచిది
అందుకే వాష్ రూం బయటే బ్రషెస్ బాక్స్ ఏర్పాటు చేసుకోవాలి. లేనియెడల కొత్త కొత్త జ్వరాల బారిన పడే ఆస్కారంలేకపోలేదు. ఇక కొవిడ్ టైంలో చాలా మంది పాత బ్రష్‌లను వదిలేస్తే బెటర్. ఇంట్లో ఎవరికైనా కొవిడ్ పాజిటివ్ వస్తే ఆ వ్యక్తి వాడిన బ్రష్ మళ్లీ బాక్సులో వేస్తే అందరికీ వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. అందుకే పాత బ్రష్‌లు ఎక్కువ కాలం వినియోగించడం కంటే పడవేయడమే బెటర్.. కరోనా టైంలో మనం వాడే వస్తువులను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనం అంత ఆరోగ్యంగా ఉండవచ్చును.