Travelling : దూర ప్రయాణాలు చేసే సమయంలో ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారా... అయితే ఈ చిట్కాలు పాటించండి...!
Travelling : చాలామందికి దూర ప్రయాణాలు చేసే సమయంలో వాంతులు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతో కొంతమంది ప్రయాణాలకు దూరంగా ఉంటారు. మరి కొంతమందికి కారు ఎక్కిన తర్వాత వికారంగా ఉంటుంది. దీనిని ” మెన్షన్ సిక్ నెస్ ” అని అంటారు. అయితే ఈ సమస్యతో భాదపడేవారు ప్రయాణం చేసేటప్పుడు వాంతులు కాకుండా ఉండడం కోసం కొన్ని జాగ్రత్తలను పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కారు ఎక్కిన తర్వాత కొంతమంది సీట్లో కూర్చొని కదులుతూ ఉంటారు. దీనివల్ల వెంటనే వాంతులు వస్తాయి. ఎందుకంటే ప్రయాణం చేస్తున్నప్పుడు కళ్ళు మెదడుకు దృశ్య సందేశానికి మరియు లోపల చెవి ఇచ్చే సందేశానికి మధ్య పొంతన ఏర్పడినప్పుడు మెదడు గందరగోళానికి గురి అవచ్చు. దీని కారణంగా ప్రయాణం చేసే సమయంలో వాంతులు లేదా వికారంగా ఉంటుంది.
Travelling : దూర ప్రయాణాలు చేసే సమయంలో ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారా… అయితే ఈ చిట్కాలు పాటించండి…!
మరి దీనికి పరిష్కారంగా ప్రయాణం చేస్తున్న సమయంలో కదలకుండా కూర్చోవాలి. అలాగే కారు విండో పక్కన కాకుండా మధ్యలో కూర్చోవడం మంచిది. అంతేకాకుండా కారు ముందు సీట్లో కూడా కూర్చోవచ్చు. చాలామంది ప్రయాణం చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ మరియు లాప్టాప్ వంటివి ఉపయోగిస్తారు. కానీ ఇలా అసలు చేయకూడదు. అంతేకాదు చదవడం వంటివి కూడా చేయకూడదు. ఒకవేళ మీకు వికారంగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే కారు కిటికీలను తెరిచి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలి. ఇకపోతే పాటలు వినడం వలన కూడా మీ మనసుని వికారం నుంచి నియంత్రించవచ్చు. లేదా ఇతరులతో మాట్లాడండి.
దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎక్కువగా తినకూడదు. ప్రయాణం చేసే ముందుగానే అంటే 45 నిమిషాల ముందు లేదా ఒక గంటకి ముందుగానే భోజనాన్ని పూర్తి చేయాలి. ముఖ్యంగా ప్రయాణం చేసే ముందు వేయించిన ఆహారాలు మద్యం మరియు దూమపానం వంటివి చేయకూడదు. ప్రయాణం చేసే సమయంలో లవంగాలు , తులసి , నిమ్మకాయ వంటి సువాసన మూలికలను ఉపయోగించవచ్చు. ఒకవేళ మీకు అసౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే వాహనం యొక్క వేగాన్ని తగ్గించమని చెప్పండి.తద్వారా మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Etela Rajender : మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ రూరల్ మండల్లో బిజెపి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి…
Uppal : ఉప్పల్ లో రోడ్డు తిప్పల్ తీరనుంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని రోడ్డు సమస్యకు చెక్ పడనుంది.…
Gut Health : కారణంగా శరీరంలో కడుపు నుంచి శబ్దాలు వినడం సర్వసాధారణం కొన్ని శబ్దాలు ఆకలి అయినప్పుడు కడుపులోని…
Snake : మహబూబ్నగర్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కర్రీపఫ్ తినేందుకు బెకరీకి వెళ్లిన ఒక మహిళ తను తింటున్న…
Monsoon in Oily Skin : వర్షాకాలంలో చర్మంతో బాధపడేవారు మొటిమల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు ఒక గంట…
Pistachios Salmonella : దేశంలో పిస్తా పప్పుని తింటే ప్రజలకు ఇన్ఫెక్షన్లకు గురయ్యారట.ఇవి శరీరానికి ఎంతో శక్తివంతమైన డ్రై ఫ్రూట్…
Early Puberty : ప్రస్తుత కాలంలో చూస్తే పిల్లలు చిన్న వయసులోనే పెద్దవారిగా కనిపిస్తున్నారు.ఇలా జరిగేసరికి చాలామంది తల్లిదండ్రులు కంగారు…
Children Wetting The Bed : పసిపిల్లలు రాత్రిలో ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఫైవ్ ఇయర్స్ లోపు…
This website uses cookies.