Drinking Water : భూ ప్రపంచంలో నీరు లేకుండా ఏ జీవులు జీవించలేవు. అదేవిధంగా ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రతి వ్యక్తి రోజులో కొంత మొత్తంలో నీరుని తీసుకోవాలి. ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగడం వలన శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రోజులో ఎక్కువ మోతాదులో నీరు తీసుకోవడం వలన ప్రతికూల ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నీటిని తక్కువ తీసుకోవడం శరీరానికి హానికరం అయినప్పటికీ ఎక్కువ నీటిని తీసుకోవడం కూడా హానికరమే. మరి అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం… శరీరంలో నీరు తక్కువ అయితే డిహైడ్రేషన్ అవుతుంది. అలాగే శరీరంలో నీరు ఎక్కువగా ఉంటే ఓవర్ హైడ్రేషన్ అని అంటారు. సాధారణంగా ఓవర్ హైడ్రేషన్ రెండు కారణాల వల్ల సంభవిస్తుంది. అవి ఏమిటంటే నీరు ఎక్కువగా తాగడం మరియు మూత్రపిండాలు నీటిని నిలుపుకోవడం. దీనివలన శరీరంలో సోడియం తగ్గుతుంది. దీనినే అల్పోష్ణస్థితి అని అంటారు. అంతేకాదు రక్తంలోని ఎలక్ట్రోలైట్స్ పలచబడతాయి.
శరీరంలోకి నీరు వెళ్ళినప్పుడు ఆక్సిజన్ మరియు పోషకాలను అందించి ఉష్ణోగ్రతను నియంత్రించడం జరుగుతుంది. అదేవిధంగా శరీరం నుండి అనవసరమైన పదార్థాలలో తొలగించడానికి నీరు ఎంతో అవసరం అవుతుంది. మూత్రపిండాలు మరియు కాలుష్యంతో ఒత్తిడిని తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇక నీరు శరీర కణాలను తేమగా ఉంచడానికి ఉపయోగపడడంతో పాటుగా శరీరంలోని అవాంఛిత పదార్థాలతో మూత్రం ద్వారా అదనపు నీరు శరీరం నుండి తొలగిస్తాయి.
ఇలా జరగని నేపథ్యంలో శరీరంలోని మీరు అధికంగా పేరుకుపోవడం జరుగుతుంది. దీని వలన శరీరం దెబ్బతింటుంది. ఒకవేళ శరీరంలో అధిక మోతాదులో నీరు ఉన్నట్లయితే వికారం కండరాల ఉద్రిక్తత తలనొప్పి మరియు మైకము వంటివి అనిపిస్తాయి. అయితే కొన్ని సందర్భాలలో నీరు అధికంగా ఉన్నప్పుడు ప్రారంభ సంకేతాలను గుర్తించడం కష్టమవుతుంది. దీంతో శరీర భాగాలలో కాళ్లు మరియు చేతులు వాపుకు కారణమవుతాయి.
ముఖ్యంగా నీరు ఎక్కువగా తాగినట్లయితే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక పరిస్థితులు మెదడు కణాల వాపుకు కారణమవుతాయి. అయితే నాడీ వ్యవస్థ రుగ్మతల వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నట్లయితే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
Ashu Reddy : జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డి బిగ్ బాస్ షోతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక…
HMPV Virus : చైనాలో కొత్త వైరస్ మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది. కరోనాకు…
Game Changer AP Ticket Rates : ఏపీలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ Game Changer Review చిత్రంకి…
Jobs : భారతదేశంలో ఉద్యోగ కల్పన సమస్య Job Creation Problem ముప్పుగా మారుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. దేశంలో పని…
YS Jagan : ఇటీవల వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తుండడం మనం చూస్తూనే…
Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్ Game Changer …
Ram Charn : మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు చిరంజీవి తనయుడు రామ్…
Drum Stick : ఈ రోజుల్లో చాలా మంది బిజినెస్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అయితే ఏ బిజినెస్ బాగా క్లిక్…
This website uses cookies.