Bad Habits : ఇలా చేస్తే ఎలాంటి చెడు అలవాట్లనైనా వదులుకోవచ్చు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bad Habits : ఇలా చేస్తే ఎలాంటి చెడు అలవాట్లనైనా వదులుకోవచ్చు..

Bad Habits : ఈ మధ్య కాలంలో చాలా మందిలో చెడు అలవాట్లు ఉంటున్నాయి. అవి సాధారణంగా మారిపోయాయి. కొందరు ఈ అలవాట్ల నుండి బయట పడాలని బలంగా అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించిన విఫలం అవుతూ ఉంటారు. మద్యం సేవించడం, సిగరెట్లు కాల్చడం, పేకాట ఆడటం, బెట్టింగ్ లాంటివి చాలా మంది జీవితాలను నాశనం చేయడం కళ్లారా చూసే ఉంటాం. ఇలాంటి అలవాట్లు స్నేహితుల వల్లే ఇవన్నీ అలవాటు అయ్యాయని అనడం తరచూ వినిపించే […]

 Authored By pavan | The Telugu News | Updated on :26 March 2022,6:00 am

Bad Habits : ఈ మధ్య కాలంలో చాలా మందిలో చెడు అలవాట్లు ఉంటున్నాయి. అవి సాధారణంగా మారిపోయాయి. కొందరు ఈ అలవాట్ల నుండి బయట పడాలని బలంగా అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించిన విఫలం అవుతూ ఉంటారు. మద్యం సేవించడం, సిగరెట్లు కాల్చడం, పేకాట ఆడటం, బెట్టింగ్ లాంటివి చాలా మంది జీవితాలను నాశనం చేయడం కళ్లారా చూసే ఉంటాం. ఇలాంటి అలవాట్లు స్నేహితుల వల్లే ఇవన్నీ అలవాటు అయ్యాయని అనడం తరచూ వినిపించే మాటే. అయితే.. మనం నిబ్బరంగా ఉండి ఎవరి మాటా వినకుండా మనసును కంట్రోల్ చేసుకుంటే ఎవరు మాత్రం ఏమీ చేయగలరు. మరికొందరేమో సమాజంలో ఉంటున్నప్పుడు ఉద్యోగ, వ్యాపారాల్లో ఇలాంటివి తప్పవు.

మన కోసం కాకపోయినా ఎదుటి వారి కోసమైనా కొన్ని కొన్ని అలవాట్లు  అవుతాయని చెబుతుంటారు.కొందరు మాత్రం చెడు అలవాట్ల నుండి బయట పడటానికి విశ్వ ప్రయత్నం చేస్తామని మాటలు చెబుతారు కానీ ఆచరణలో మాత్రం విఫలం అవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ సలహా. ఇది పాటిస్తే ఎలాంటి చెడు అలవాట్లనైనా దూరం చేసుకోవచ్చు. చెడు అలవాట్లను మానుకోవాలి అని అనుకున్న వాళ్లు మిత్రులతో ఉన్నా… బంధువులతో ఉన్నా ఎంతమందిలో ఉన్నా వారి మాటకే కట్టుబడి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో సారి వాటిని స్వీకరించకూడదను లక్ష్యంగా పెట్టుకోవాలి. స్నేహితుల్లో మనం చులకన అయిపోతాం అనేది వదులుకోవాలి. మన కోసం మన నిర్ధారించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి వాటికి లొంగబోనని ప్రతిజ్ఞ తీసుకోవాలి.ఈ మధ్య చిన్న పిల్లలు కూడా మందుకు బానిసలై పోతున్నారు.

how to get rid of Bad Habits

how to get rid of Bad Habits

టీనేజీలోకి రాగానే ఫ్రెండ్స్ నుండి ఇలాంటి అలవాట్లు నేర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తాగుతున్నారని, ఒక్కటి తాగితే ఏమీ కాదని ఇలా చెబుతూ తాగాలని ప్రోత్సహిస్తూ ఉంటారు. సిగరెట్లు కూడా స్నేహితుల వల్లే అలవాటు అవుతాయి.  దీనిపై పిల్లలను ముందే అప్రమత్తత చేయడం తల్లిదండ్రులు బాధ్యత అనే చెప్పాలి. ఇలాంటి వారికి దూరంగా ఉండాలని చెబితే వారు అస్సలే వినరు. అదీకాక తల్లిదండ్రులకు చెప్పకుండా వారితో కలిసి తిరగుతూ మరిన్ని చెడు అలవాట్లకు బానిసలు అవుతారు. అలా కాకుండా ఫ్రెండ్స్ తో వెళ్లొచ్చని చెబుతూనే… ఇలాంటి అలవాట్లపై వారిని అప్రమత్తం చేయాలి. వాళ్లు మందు తాగాలని, సిగరెట్ తాగాలని ఒత్తిడి చేస్తారని ముందే చెప్పాలి. అలా పిల్లలను ముందే అప్రమత్తం చేయడం ద్వారా వారికి చెడుకు మంచికి స్పష్టమైన భేదం తెలిసి వస్తుంది.

Also read

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది