Makhana Chivda : ఫుల్ మఖానాను ఇలా తయారు చేయండి… టేస్ట్ తో పాటు ఆరోగ్యం మీ సొంతం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Makhana Chivda : ఫుల్ మఖానాను ఇలా తయారు చేయండి… టేస్ట్ తో పాటు ఆరోగ్యం మీ సొంతం…!

Makhana Chivda : ఫుల్ మఖాన ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే సంగతి అందరికీ తెలిసినదే. అయితే వీటితో కూరలు మరియు స్నాక్స్ ఇలా ఎన్నో రకాలుగా తయారు చేసుకొని మరీ తింటారు. వీటితో చేసిన రెసిపీలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిలో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవటం వలన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు దొరుకుతాయి. అలాగే వీటిని తినడం వలన దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అయితే ఎంతో ఆరోగ్యకరమైన మఖానాతో […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 September 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Makhana Chivda : ఫుల్ మఖానాను ఇలా తయారు చేయండి... టేస్ట్ తో పాటు ఆరోగ్యం మీ సొంతం...!

Makhana Chivda : ఫుల్ మఖాన ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే సంగతి అందరికీ తెలిసినదే. అయితే వీటితో కూరలు మరియు స్నాక్స్ ఇలా ఎన్నో రకాలుగా తయారు చేసుకొని మరీ తింటారు. వీటితో చేసిన రెసిపీలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిలో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవటం వలన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు దొరుకుతాయి. అలాగే వీటిని తినడం వలన దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అయితే ఎంతో ఆరోగ్యకరమైన మఖానాతో పిల్లలు ఎంతో ఇష్టపడి తినేలా ఓ హెల్దీ స్నాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అయితే వీటిని సాధారణంగా చిడ్వా లేక చివ్ డా ను అటుకులతో ప్రిపేర్ చేస్తారు. కానీ ఫుల్ మఖానా తో చేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది. వీటిని చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. మరి దానిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం…

ఫుల్ మఖాన చిడ్వాకి కావలసిన పదార్థాలు : పల్లీలు, ఫుల్ మఖాన, ఎండుమిర్చి,కొబ్బరి ముక్కలు, కరివేపాకు బాదం,పసుపు, కారం, ఉప్పు, జీడిపప్పు, పుట్నాలు,ఆయిల్,నెయ్యి…

తయారీ విధానం : ముందుగా మనం ఒక కడాయిని తీసుకోవాలి. దీనిలో కొద్దిగా ఆయిల్ మరియు నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. వీటిలో కొద్దిగా మఖాన వేసుకొని చిన్న మంటపైన ఫ్రై చేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకొని తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా జీడిపప్పు, వేరుశనగలు, బాదంపప్పు ఒక దాని తర్వాత మరొకటి వేసుకుంటూ ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత పుట్నాలు, కొబ్బరి ముక్కలు, కరివేపాకు, ఎండు మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.

Makhana Chivda ఫుల్ మఖానాను ఇలా తయారు చేయండి టేస్ట్ తో పాటు ఆరోగ్యం మీ సొంతం

Makhana Chivda : ఫుల్ మఖానాను ఇలా తయారు చేయండి… టేస్ట్ తో పాటు ఆరోగ్యం మీ సొంతం…!

ఇవి ఎక్కువసేపు మండకుండా చూసుకోవాలి. అలాగే వీటిలో ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేయాలి. మీరు కావాలనుకుంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. తర్వాత వీటిలో నట్స్ మరియు ముఖాన వేసి బాగా కలిపి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇవి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత గాలి కూడా వెళ్లని స్టీలు డబ్బాలో వీటిని స్టోర్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మఖానా చిడ్వా రెడీ అయినట్లే…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది