White Hair : తెల్ల జుట్టు వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటిస్తే.. మీ జుట్టు వెంటనే నల్లగా మారుతుంది..!
White Hair : తెల్ల జుట్టు అనే సమస్య ప్రతి పది మందిలో ఇద్దరు ముగ్గురిని వేధిస్తుంది. సాధారణంగా వయసు మీద పడ్డాక తెల్ల జుట్టు వస్తే పర్వాలేదు. కానీ.. యుక్త వయసులోనే తెల్ల జుట్టు రావడం వల్ల చాలామంది ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. జుట్టు రాలడం ఒక సమస్య అయితే.. తెల్ల జుట్టు రావడం అనేది ఇంకో పెద్ద సమస్యగా మారింది. అందుకే.. జనాలు కూడా తెల్ల జుట్టు అనగానే భయపడిపోతున్నారు. యుక్త వయసులో ఉన్న యువకులు అయినా యువతులు అయినా తెల్ల జుట్టు వస్తే తమకు ఇక పెళ్లి కాదని తెగ టెన్షన్ పడుతుంటారు. కానీ.. తెల్ల జుట్టు వచ్చినంత మాత్రాన పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తెల్ల జుట్టు వచ్చినా.. చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే.. తెల్ల జుట్టు మాయం అయి.. నల్ల జుట్టు వచ్చే అవకాశం ఉంటుంది.

how to prevent white hair home remedies telugu
చాలామంది బయటికి వెళ్లినప్పుడు తమ తెల్ల జుట్టును చూసి అందరూ అవహేళన చేస్తారని.. మార్కెట్ లో దొరికే హెయిర్ డ్రైలను వాడుతుంటారు. అవన్నీ తాత్కాలికమే. అటువంటి వాళ్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. జుట్టు ఇంకా తెల్లబడుతుంది తప్పితే నల్లబడదు. కానీ.. ఆయుర్వేదంలో తెల్ల జుట్టును నల్ల జుట్టుగా మార్చేందుకు మందు ఉంది. దాని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ వంటింట్లో ఉండే పదార్థాలతోనే మీ తెల్ల జుట్టును నల్లగా చేసుకోండి.
White Hair : తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు చేయాల్సిన పని ఇదే
మీరు ముందుగా ఉసిరి నూనెను తీసుకోండి. పచ్చి పటికను తీసుకోండి. దాన్నే స్పటిక అని కూడా అంటారు. అది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. అలాగే.. విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకోండి. ఈ మూడింటిని రెడీగా పెట్టుకోండి. ముందు ఒక గిన్నెను తీసుకొని.. దాంట్లో కాసింత స్పటికం పొడి వేయండి. ఆ పొడిలో కాసింత ఉసిరి నూనెను కలపండి. ఆ తర్వాత విటమిన్ ఈ ట్యాబ్లెట్లను తీసుకొని.. వాటిని చిన్నచిన్నగా కట్ చేసి ఆ మిశ్రమంలో వేసి.. దాన్న బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని పేస్ట్ లా చేయండి.

how to prevent white hair home remedies telugu
మీరు ఎప్పుడైతే స్నానం చేయాలనుకుంటారో.. దానికి ఒక గంట ముందు.. ఆ మిశ్రమాన్ని తల వెంట్రుకలకు రుద్దండి. మొత్తం వెంట్రుకలకు రుద్దిన తర్వాత.. తలను కాసేపు మసాజ్ చేసుకొని గంట నుంచి రెండు గంటల పాటు తలను అలాగే ఆరనివ్వాలి. ఆ తర్వాత.. ఏదైనా హెర్బల్ షాంపు ఉపయోగించి లేదా ఆయుర్వేద షాంపును ఉపయోగించి తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేశారంటే.. తెల్ల జుట్టు మాయం అయి.. నల్ల జుట్టు వచ్చేస్తుంది.దీంట్లో ఉండే రహస్యం ఏంటంటే.. మీరు ఉపయోగించే స్పటికలో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది. అదే తెల్ల జుట్టును నల్లగా మార్చుతుంది.

how to prevent white hair home remedies telugu
అలాగే.. ఉసిరి నూనె.. వెంట్రుకల కుదుళ్లకు ఆక్సిజన్ ను అందిస్తుంది. దాని వల్ల.. జుట్టు ఊడటం తగ్గిపోయి.. జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు నల్లగా మారుతుంది. విటమిన్ ఈ జుట్టు కుదుళ్లు ధృడంగా ఉండేందుకు సహకరిస్తుంది. అందుకే.. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుంటే.. జుట్టు ధృడంగా తయారు అవ్వడంతో పాటు.. జుట్టు నల్లగా మారుతుంది.