Black Hair : జుట్టుకు రంగు అక్కర్లేదు..ఈ సింపుల్ చిట్కాతో 15 నిమిషాల్లో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి..!
ప్రధానాంశాలు:
Black Hair: జుట్టుకు రంగు అక్కర్లేదు..ఈ సింపుల్ చిట్కాతో 15 నిమిషాల్లో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి..!
Black Hair : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వర్క్ టెన్షన్స్ కారణంగా ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా కనిపిస్తున్న సమస్య జుట్టు రాలడం, జుట్టు తెల్లబడటం. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే ఈ సమస్య ఇప్పుడు యువతకూ పెద్ద తలనొప్పిగా మారింది. సర్వేలను గమనిస్తే ప్రతి 10 మందిలో సుమారు 8 మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. తెల్ల జుట్టును దాచేందుకు చాలామంది మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్, కెమికల్ ఉత్పత్తులపై ఆధారపడుతున్నారు. కానీ ఇవి తాత్కాలిక ఫలితాలే ఇస్తాయి. కొన్నిసార్లు జుట్టు మరింత దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే సహజమైన మార్గాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం.
Black Hair: జుట్టుకు రంగు అక్కర్లేదు..ఈ సింపుల్ చిట్కాతో 15 నిమిషాల్లో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి..!
Black Hair : తెల్ల జుట్టుకు ప్రధాన కారణాలు
ఈ మధ్యకాలంలో తెల్ల జుట్టు సమస్య ఎక్కువ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. జీవనశైలిలో వచ్చిన మార్పులు, సరైన పోషకాహారం లేకపోవడం, కాలుష్యం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఇవన్నీ జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా విటమిన్ B12, ఐరన్ లోపం వల్ల జుట్టు త్వరగా తెల్లబడే అవకాశాలు పెరుగుతున్నాయి. దీనికి తోడు ఫాస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం కూడా జుట్టు రంగుపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కెమికల్స్ కాకుండా సహజమైన మార్గాలను అనుసరించడమే దీర్ఘకాలిక పరిష్కారం.
Black Hair: టామోటా ..జుట్టు రంగు మార్పులో సహజ సహాయకుడు
మన వంటింట్లో నిత్యం ఉపయోగించే టామోటా కేవలం రుచికరమైన కూరగాయ మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్య నిపుణుల మాటల ప్రకారం టామోటా జుట్టు పిగ్మెంటేషన్‌ను ఉత్తేజపరిచి సహజంగా నల్లజుట్టు రావడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారికి టామోటా మంచి సహజ పరిష్కారంగా పనిచేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకు పోషణ అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
Black Hair: టామోటా హెయిర్ ప్యాక్ తయారీ విధానం
టామోటాతో జుట్టును నల్లగా మార్చుకోవాలంటే ముందుగా సరైన ప్యాక్ తయారు చేయాలి. ఇందుకోసం సగం టామోటాను మెత్తగా గుజ్జుగా చేసుకోండి. దీనిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ కలపండి. వీలైతే కొద్దిగా హెన్నా పేస్ట్ కూడా జోడించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి సుమారు 15 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత బ్రష్ సహాయంతో ఈ ప్యాక్‌ను జుట్టు మొత్తం మీద సమానంగా అప్లై చేయండి. 15 నుంచి 20 నిమిషాల వరకు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ రెగ్యులర్ షాంపూ ఉపయోగించి శుభ్రంగా కడగండి. ప్రతి నెలా ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల క్రమంగా జుట్టు నల్లగా మారడంతో పాటు మెరుపు కూడా పెరుగుతుంది. సహజంగా సురక్షితంగా జుట్టు అందాన్ని పెంచుకోవాలంటే ఈ టిప్ తప్పకుండా ప్రయత్నించండి.