Husband Wife : భాగ‌స్వామితో కూడా ముద్దు డేంజ‌రే.. తేల్చి చెప్పిన శాస్త్రవేత్త‌లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Husband Wife : భాగ‌స్వామితో కూడా ముద్దు డేంజ‌రే.. తేల్చి చెప్పిన శాస్త్రవేత్త‌లు

 Authored By ramu | The Telugu News | Updated on :7 June 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Husband Wife : భాగ‌స్వామితో కూడా ముద్దు డేంజ‌రే.. తేల్చి చెప్పిన శాస్త్రవేత్త‌లు

Husband Wife : వైవాహిక జీవితంలో ముద్దులు ఇద్ద‌రి మ‌ధ్య బంధాన్ని మ‌రింత స్ట్రాంగ్ చేస్తాయి. కానీ ఎక్స్‌ప్లోరేటరీ రీసెర్చ్ అండ్ హైపోథెసిస్ ఇన్ మెడిసిన్లో ప్రచురితమైన ఓ తాజా అధ్యయనం ఇందుకు విరుద్దంగా ఫలితాలు వెల్ల‌డించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. భాగస్వామి ముద్దుల వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చింది. ఇరాన్‌లో కొత్తగా వివాహమైన 1,740 జంటలపై జరిపిన ఈ పరిశోధనలో 268 జంటలను అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ప్రతి జంటలో ఒక భాగస్వామి ఆరోగ్యంగా ఉండగా, మరొకరు నిద్రలేమి, డిప్రెషన్, ఆందోళనతో బాధపడుతున్నట్టుగా శాస్త్ర‌వేత్త‌లు తేల్చారు.

Husband Wife భాగ‌స్వామితో కూడా ముద్దు డేంజ‌రే తేల్చి చెప్పిన శాస్త్రవేత్త‌లు

Husband Wife : భాగ‌స్వామితో కూడా ముద్దు డేంజ‌రే.. తేల్చి చెప్పిన శాస్త్రవేత్త‌లు

Husband Wife జ‌ర జాగ్ర‌త్త‌..

స‌ద‌రు జంట‌ల నుండి నోటి మైక్రోబయోమ్ నమూనాలను, కార్టిసాల్ (స్ట్రెస్ హార్మోన్) స్థాయిలను సేకరించి ఆరు నెలల తర్వాత తిరిగి పరిశీలించారు. ఆరు నెలల తర్వాత ఆరోగ్యవంతమైన భాగస్వాములలో డిప్రెషన్, ఆందోళన, నిద్ర నాణ్యత తగ్గడం గమనించిన‌ట్టుగా పేర్కొన్నారు.

ముఖ్యంగా స్త్రీలలో ఈ మార్పులు మరింత స్పష్టంగా కనిపించాయి. అనారోగ్యంతో ఉన్న భాగస్వామి నుంచి నోటిలోని బ్యాక్టీరియా ఆరోగ్యవంతమైన భాగస్వామికి చేరడం వల్ల మానసిక స్థితి, నిద్ర విధానాలలో మార్పులు సంభవించవచ్చని పరిశోధకులు సూచించారు. నిద్రలేమితో బాధపడేవారిలో కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉండగా, ఆరు నెలల తర్వాత ఆరోగ్యవంతమైన భాగస్వాములలో కూడా కార్టిసాల్ స్థాయిలు పెరిగాయి.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి