Husband Wife : ఘోస్ట్ లైటింగ్.. డేటింగ్‌లో కొత్త మానసిక వేధింపుల ధోరణి !
ప్రధానాంశాలు:
Husband Wife : ఘోస్ట్ లైటింగ్.. డేటింగ్‌లో కొత్త మానసిక వేధింపుల ధోరణి !
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో తాజాగా చర్చనీయాంశంగా మారినది ఘోస్ట్ లైటింగ్ అనే ధోరణి. ఒక వ్యక్తి డేటింగ్‌లో ఉన్న వ్యక్తిని అకస్మాత్తుగా విడిచిపెట్టి, కొంతకాలానికే తిరిగి వచ్చి మళ్లీ సంబంధాన్ని మొదలుపెడతాడు. ఆ తర్వాత తప్పులకూ బాధ్యతగా మిమ్మల్నే చూపిస్తాడు. “నువ్వే కారణం”, “నువ్వే అర్థం చేసుకోలేదు” అంటూ మానసికంగా దిగజార్చే ప్రయత్నం చేస్తాడు. ఇది తాత్కాలికంగా కాక, పదే పదే జరిగితే తీవ్ర మానసిక ప్రభావం చూపిస్తుంది.

husband wife : ఘోస్ట్ లైటింగ్.. డేటింగ్‌లో కొత్త మానసిక వేధింపుల ధోరణి !
husband wife : ఇదొక కొత్త సమస్య..
ఘోస్ట్ లైటింగ్ లక్షణాలు చూస్తే.. అకస్మాత్తుగా అదృశ్యం . ఫోన్లకు స్పందించకపోవడం, మెసేజులకు రిప్లై ఇవ్వకపోవడం. సోషల్ మీడియా మీద గందరగోళం.మీ పోస్ట్‌లకు లైక్ వేస్తాడు కానీ, మీ మెసేజ్‌లకు స్పందించడు. తప్పు మీదే అన్నట్లు చేస్తాడు .అతని ప్రవర్తనను ప్రశ్నిస్తే, “నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు” అని బాధ్యతను మీ మీద వేస్తాడు. మిమ్మల్ని మీరే నమ్మకుండా చేస్తాడు, ఆత్మవిశ్వాసాన్ని తక్కువ చేస్తాడు
ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం ఎలా చూపుతుంది అంటే విశ్వాసం కోల్పోతారు, తాము ఏమి తప్పు చేశామో అర్థంకాని గందరగోళంలో పడతారు. అసహాయత, డిప్రెషన్‌కి గురవుతారు. సంబంధాల పట్ల భయం, నిరాసను పెంచుకుంటారు. ఇలాంటి ధోరణి నుంచి బయటపడాలంటే ..సంబంధంలో ఎవరి ప్రవర్తనలోనైనా అప్రత్యక్ష మార్పులు కనిపిస్తే జాగ్రత్తపడాలి. ఘోస్ట్ లైటింగ్ అనుమానముంటే స్పష్టంగా మాట్లాడి తేల్చుకోవాలి. మిమ్మల్ని తక్కువగా చూసే సంబంధాల నుంచి బయటపడేందుకు వెనకాడకూడదు. ఘోస్ట్ లైటింగ్ అనేది డేటింగ్‌లో అత్యంత ప్రమాదకరమైన మానసిక వేధింపు రూపం. ప్రేమ, బంధం అనే పేరుతో జరుగుతున్న ఈ గోప్య మానసిక ఆటలు, బాధితులపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చు