Monsoon Care : ఈ ఆహారాలను వర్షాకాలంలో తింటే…ఇలాంటి వ్యాధులన్నీ పరార్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

 Monsoon Care : ఈ ఆహారాలను వర్షాకాలంలో తింటే…ఇలాంటి వ్యాధులన్నీ పరార్…?

 Authored By aruna | The Telugu News | Updated on :20 August 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Monsoon Care : ఈ ఆహారాలను వర్షాకాలంలో తింటే...ఇలాంటి వ్యాధులన్నీ పరార్...?

Monsoon Care : వాతావరణం మార్పులు సంభవిస్తే వ్యాధులు కూడా వెంటాడుతాయి. అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా చుట్టూ ముడతాయి.వీటినుంచి బయట పడుటకు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఒకే పదార్థం తినడం సరిపోదు సరైన పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవాలి. సరేనా పోషకాలతో నిండిన ఆహారాలను తీసుకోవడం కూడా ముఖ్యమే. మన ఇంట్లోనే ఈజీగా దొరికే కొన్ని సాధారణ పదార్థాలతో ఇమ్యూనిటీని సులువుగా పెంచుకోవచ్చు.వర్షాకాలం వచ్చిందంటే అంటు వ్యాధులు ప్రబులుతాయి. ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. ఈ పరిస్థితుల్లో మన శరీరాన్ని కాపాడుకొనుటకు బలమైన యూనిటీ పవర్ కలిగిన ఆహారాలను తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.మన వంటింట్లో రోజు వాడే కొన్ని పదార్థాలు కూడా యూనిటీని పెంచుతుంది అవేంటో తెలుసుకుందాం..

Monsoon Care ఈ ఆహారాలను వర్షాకాలంలో తింటేఇలాంటి వ్యాధులన్నీ పరార్

Monsoon Care : ఈ ఆహారాలను వర్షాకాలంలో తింటే…ఇలాంటి వ్యాధులన్నీ పరార్…?

పసుపు

పసుపు లో ఉండే కర్క్యూమిని అనే పవర్ఫుల్ సమ్మేళనం ఇన్ఫెక్షన్లను తగ్గించుటకు ముఖ్యంగా పనిచేస్తుంది. ఇది జ్వరం, దగ్గు వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. కర్రీలలో, సూపులలో పసుపు వేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

మునగ

మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.అంతేకాక యూనిటీని కూడా బలోపేతం చేయగలదు.

వెల్లుల్లి

యాంటీ బాక్టీరియల్,యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.

అల్లం

అల్లం వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో అల్లం టీ తాగడం లేదా అల్లం కలిపిన నీళ్లు తాగితే చాలా మంచిది.

పాలకూర

పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్రను పోషిస్తుంది.

చింతపండు

చింతపండులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.జీర్ణక్రీయను మెరుగుపరిచి శరీరంలో వచ్చే వాపును తగ్గిస్తుంది. ఆహారంలో చింతపండు చేర్చుకుంటే ఇమ్యూనిటీ పెంచుతుంది. ఈ ఫుడ్స్ మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే వర్షాకాలంలో వచ్చే రోగాల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది