Water : బెల్లం ఒక సహజమైన స్వీట్నర్. బెల్లం తినడం వల్ల పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో రకాల మేలు చేస్తాయి. ఈ బెల్లంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం,జింక్, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలతో పాటు బి కాంప్లెక్స్, సి, బి2,ఈ.. లాంటి విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. చలికాలంలో మన డైట్ లో బెల్లం చేర్చుకుంటే… శరీరంలో వేడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం… పరిగడుపున బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంట. పూర్తి వివరాలతో.. అయితే ఆయుర్వేదం ప్రకారం వేడి నీటిలో బెల్లం కలుపుకుని తాగితే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలను చెక్ పెట్టవచ్చు. బెల్లం లోని పోషకాలు జలుబు, దగ్గు,ఫ్లూ లక్షణాలను తగ్గిస్తాయి. బెల్లంలో.. ఫినోలిన్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతాయి. శరీరాన్ని రిలాక్స్ చేసి.. మనం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
బెల్లం నీరు తాగితే శరీరంలో ఇమ్యూనిటీ ఒక బూస్ట్ లా పని చేస్తుంది. బెల్లం లో మెగ్నీషియం విటమిన్లు బి1, బి6, సి తో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. బెల్లం నీరు తాగటం వలన మన శరీరంలోని హాని చేసే మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. బెల్లంలో ఫైబర్ మెండుగా ఉంటుంది. కావున ఈ బెల్లమును షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు.ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. శ్వాస కోసవ్యవస్థ, ఊపిరితిత్తులు,ఆహార నాళము, కడుపు,పేగులను కూడా శుభ్రపరుస్తుంది. ఇది ఒక న్యాచురల్ డైజెస్టివ్ ఎంజైములను మెరుపు పరుస్తుంది. జీవక్రియ వేగంగా జరిగేలా చేస్తుంది. అలాగే కిడ్నీ సమస్యలు కూడా నయం చేస్తుంది.
అలాగే బెల్లం నీరు ప్రతిరోజు పరిగడుపున తాగటం వలన శరీరంలో పేర్కొన్న కొవ్వును కరిగించి వేస్తుంది. ఈ బెల్లం లో ఉండే పొటాషియం శరీరంలోనే ఎలక్ట్రోలైట్, మినరల్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను పెంచడమే కాక అధిక కొలెస్ట్రాల్ సమస్యను కూడా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గించడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇకపోతే బెల్లం నీరు తయారీ కోసం కావలసినంత బెల్లం, చియా సీడ్స్, నిమ్మకాయ, పుదీనా ఆకులు ఇవన్నీ తీసుకొని, ముందుగా మీరు సరిపడా నీళ్లను తీసుకొని. ఆ నీళ్లలో బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు వేడి చేసుకోవాలి. ఆ తరువాత నీటిలో నిమ్మరసం, చియా సీడ్స్, పుదీనా ఆకులు వేసుకొని మరిగించి. అయిన తర్వాత వడకట్టుకొని తాగితే సరిపోతుంది.
Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శ్రీలంక, తమిళనాడు తీరం వైపు దూసుకు వస్తుందని ఆంధ్రప్రదేశ్ విపత్తు…
Burgers : నేటి సమాజంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ లో ముఖ్యంగా…
Avanthi Srinivas : ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయాలు, రాజీనామాలతో సతమతమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ)కి మరో భారీ…
Ragi : మనము తినే రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఈ చిరుధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో…
Lip Care : చాలామందికి గులాబీ రంగులో పెదాలు అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరుకు ఇది సాధ్యం…
Rotis : ప్రస్తుత కాలంలో రైస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడని వారు. చపాతీల్ని ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే అన్నంలో కలిగే…
Winter : చలికాలంలో వాతావరణం కూల్ గా ఉంటుంది కాబట్టి,అనేక అంటువ్యాధులు కలుగుతాయి.దీంతో జలుబు దగ్గు అంటి వ్యాధులతో ఇబ్బంది…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహము సంపదలను ఇచ్చే గ్రహంగా చెప్పబడుతుంది. శుక్రుడు ధనానికి, సంపదకు అధిపతి…
This website uses cookies.