Grapes : ద్రాక్ష పండ్లలో ఏది తింటే అధిక బరువు తగ్గుతారు.?
Grapes : ద్రాక్ష పండ్లు చాలా తీయగా, పుల్లగా ఉంటాయి. ద్రాక్షలో పలు రకాలు ఉన్నాయి. ఈ పచ్చ ద్రాక్షలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జ్వరంతో బాధపడేవారు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఈ ద్రాక్షలో విటమిన్ కె ,సి ,మెగ్నీషియం, కాపర్, క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపుతాయి. కడుపులోని మంటను తగ్గిస్తాయి. జీర్ణ వ్యవస్థ సాఫీగా జరుగుతుంది. వీటిని తరచుగా డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక బరువు […]
Grapes : ద్రాక్ష పండ్లు చాలా తీయగా, పుల్లగా ఉంటాయి. ద్రాక్షలో పలు రకాలు ఉన్నాయి. ఈ పచ్చ ద్రాక్షలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జ్వరంతో బాధపడేవారు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఈ ద్రాక్షలో విటమిన్ కె ,సి ,మెగ్నీషియం, కాపర్, క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపుతాయి. కడుపులోని మంటను తగ్గిస్తాయి. జీర్ణ వ్యవస్థ సాఫీగా జరుగుతుంది. వీటిని తరచుగా డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక బరువు కూడా తగ్గుతారు. రోజు ఒక 15, 20 వరకు అయితే ఎవరైనా తీసుకోవచ్చు. భోజనం చేసిన వెంటనే తీసుకుంటే మంచిది. అలాగే ఈ గ్రేప్స్ లో వచ్చి వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉండటం మూలాన అది కేవలం మనకు ఎనర్జీ ఇవ్వటమే కాకుండా మన హైడ్రేషన్ స్టేటస్ కూడా బాగా ఉపయోగపడుతుంది.
స్పెషల్లీ సమ్మర్లో ఎండలో నుంచి బయటకు వచ్చినప్పుడు వెంటనే ఏది తినాలనిపించినప్పుడు గ్రేప్స్ చల్లగా వాటర్ లో వేసి ఉంచినటువంటి ద్రాక్షాని తింటే శరీరం ఉష్ణోగ్రతని చల్ల పరుస్తుంది. అయితే ద్రాక్షని నిత్యం తీసుకోవడం వలన బరువు పెరగకుండా ఉండడానికి ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.. ఇతర పండ్లతో పోలిస్తే ద్రాక్షాలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఆకుపచ్చ ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష తీసుకోవడం చాలా మంచిది. నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది..
ఈ నల్ల ద్రాక్షలో ఉండే ఆంటీ ఇంప్లిమెంటరీ పదార్థాలు శారీరిక మంటను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
అస్తమా ఆర్థరైటిస్ కొన్ని రకాల క్యాన్సర్లను కూడా తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులతో సహా దీర్ఘకాల వ్యాధులను అభివృద్ధి చేసి అవకాశాలను తగ్గిస్తుంది… ఈ నల్ల ద్రాక్షాలో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వలన శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. అనారోగ్యానికి దూరంగా ఉండడానికి మంచి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ద్రాక్ష జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. ద్రాక్షాలో అధిక పైబర్ కంటెంట్ ఉండటం వలన ఆరోగ్యకరమైన జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది…