Plants : ఇంట్లో ఈ మొక్కలు పెంచితే చాలు.. ఏసీ, ఫ్యాన్ తో పని లేకుండా వేసవిలో కూడా చల్లని అనుభూతి…!
Plants : మనం ఇంట్లో ఎన్నో రకాల మొక్కల్ని పెంచుతూ ఉంటాం. మొక్కలు అంటే కొన్ని డెకరేషన్ కోసం.. కొన్ని పూల కోసం.. కొన్ని పండ్ల కోసం ఇలా పెంచుతూ ఉంటాం. అయితే కొన్ని రకాల మొక్కలు మాత్రం ఇంట్లో పెంచితే చల్లటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయట. మరి ఆ మొక్కలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలకు సూర్యుడు ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు. సూర్యుడు భగవగలకు జనం బంబేలెత్తిపోతున్నారు. ఇక రాబోయే రోజుల్లో వరకు సూర్యుడు తానం నుండి ఉపశమనం కనిపించేలా లేదు. వేసవికాలంలో వాతావరణం చాలా వేడిగా ఇంట్లో ఎక్కువగా ఉంటుంది. చెమటలు అధికంగా వస్తూ ఉంటాయి. ఇటువంటి సమయంలో ఇంట్లో కూలర్, ఏసీ, ఫ్యాన్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే మీ ఇంటిని సహజంగా చల్లబరచడానికి ఏసీలు, కూలర్లు కంటే చౌకైన మార్గాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. మీ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా మీ ఇంటిని చల్లగా ఉంచడంలో కూడా కొన్ని రకాల మొక్కలు బాగా ఉపయోగపడతాయి. ఆ మొక్కలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
Plants స్పైడర్ ప్లాంట్
స్పైడర్ ప్లాంట్ పేరు కాస్త విచిత్రంగా అనిపించిన ఈ మొక్కను మీరు సులభంగా పెంచుకోవచ్చు.. ఈ మొక్కని మీరు ఎలా ఉంచిన హాయిగా పెరుగుతుంది. కచ్చితంగా ఇంట్లో వేడి తగ్గాలనుకునే వారు ఈ మొక్కని పెంచాలి.
డెవిల్స్ మొక్క:ఈ డెవిల్స్ మొక్క మనీ ప్లాంట్ జాతికి చెందినది. దీనికోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం లేదు. చిన్న మొక్క నాటితే చాలు.. దానంతట అదే పెరిగిపోతుంది. ఆకులు హృదయాకారంలో ఉంటాయి. ఇది కూడా ఇంటిని చల్లగా మారుస్తుంది..
రబ్బర్ ప్లాంట్: ఈ మొక్కకు పెద్దపెద్ద ఆకులు ఉంటాయి. ఇది అధికంగా చల్లదనాన్ని ఇస్తుంది. ఈ మొక్క ఉండే నేల మరి తడిగా మరి పొడిగా లేకుండా చూసుకోవాలి. నీళ్లు తక్కువ మోతాదులో తరచుగా పోస్తూ ఉండాలి..
చైనీస్ ఎవేర్ గ్రీన్ మొక్క: ఈ చైనీస్ మొక్క చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. పేరుకు తగ్గట్టుగానే చైనీస్ ఎవర్ గ్రీన్ మొక్క ఎప్పటికీ ఆకపచ్చుగా ఉంటూ చల్లదనాన్ని ఇస్తుంది. ఇంట్లో వేడి అధికంగా ఉంటే ఈ మొక్కలను పెంచుకుంటే ఆ వేడిని ఈ మొక్క బయటకి పంపిస్తుంది. వేడి గాలిని పీల్చుకొని వాతావరణాన్ని చల్లబరుస్తుంది.
అరే కా ఫామ్; అత్యంత ప్రాచుర్యం పొందిన లివింగ్ రూమ్ మొక్కలలో అరేకా ఫామ్ ఒకటి. ఇది ఒక అలంకారమైన ఇండోర్ మొక్క. ఇది చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఇది సహజ కెంట్ ట్గా ఉపయోగపడుతుంది. అంటే ఇండోర్ గాలిని సహజంగా తేమగా ఉంచడానికి ఇది ఉత్తమ ఉత్తమమైనది. ఇంటిని లోపల నుండి చల్లగా ఉంచడమే కాకుండా అనేక విషపదార్థాలను గాల్లో తొలగించడంలో ఉపయోగపడుతుంది.
కలమంద మొక్క: కలమంద వేసవిలో చర్మాన్ని చల్లగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఎలాంటి వడదెబ్బ లేదా టానిక్ నుండి కాపాడడానికి సహాయపడుతుంది. అందువలన కలమంద మొక్కను ఇంటి లోపలి పెంచుకుంటే అది ఇండోర్ గాలి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది..