Daughter In Law : ఇలాంటి కోడలు ఇలా ఉంటే మీ ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు..!
ప్రధానాంశాలు:
Daughter In Law : ఇలాంటి కోడలు ఇలా ఉంటే మీ ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు..!
Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. అయితే కొన్ని కుటుంబాల్లో కోడళ్ల ప్రవర్తనే ప్రధానంగా కలహాలకు దారి తీస్తోంది. తమ స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ, మిగతా కుటుంబ సభ్యుల భావాలను పట్టించుకోని కోడళ్లు ఇంట్లోని అనుబంధాలను నాశనం చేస్తారు. మిగతా వారు చెప్పిందే తప్పు అనే తీరు, ప్రతి విషయానికీ తమ మాటే నెగ్గాలనే ఆలోచన, ఇతరులను తక్కువగా చూసే దృక్పథం శాంతిని దూరం చేస్తుంది.

Daughter In Law : ఇలాంటి కోడలు ఇలా ఉంటే మీ ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు..!
Daughter In Law : ఇంటికి ఎలాంటి కోడలు రావాలో.. ఎలాంటి కోడలు రావొద్దో తెలుసా..?
ఇంకొంతమంది కోడళ్లు తమ భర్తపై పూర్తి అధికారం సాధించాలని చూస్తారు. ఆయనను అత్తమామలతో సంబంధాలు తగ్గించేలా ప్రవర్తించటం వల్ల కుటుంబంలో సంతోషం లేకుండా పోతుంది. ఇది తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాలను దెబ్బతీస్తుంది. అంతేగాక, అత్తమామలపై ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడడం.. పరువు తీసేలా వ్యవహరించడం వల్ల కుటుంబ గౌరవం దిగజారుతుంది. తాను మంచివారిలా కనిపించే ప్రయత్నంలో, తీరుగా మాట్లాడకుండా కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించడం ప్రమాదకరంగా మారుతుంది.
తన పనులు తప్ప మరోటి పట్టించుకోని తీరు, సహాయ సహకారాల వైఫల్యం, చిన్న విషయానికే గొడవలు పెట్టుకోవడం వంటి లక్షణాలు ఇంట్లో అనవసరంగా ఉద్రిక్తతను పెంచుతాయి. ఇలా ప్రవర్తించే కోడల వల్ల గృహంలో శాంతి నిలవడం అసాధ్యం. అందుకే, కుటుంబంలో ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవాన్ని, సహనాన్ని పెంపొందించుకోవాలి. కోడలు కుటుంబంలో ఒక భాగమని భావించి, తన పాత్రను సానుకూలంగా నిర్వహిస్తేనే ఇంటికి మానసిక శాంతి లభిస్తుంది.