Health Tips : మన ఆరోగ్యం బాగుండాలంటే…రోజుకు ఎన్ని అడుగులు వేయాలి…??
Health Tips : ప్రస్తుత కాలములో చాలా మంది తమ ఆరోగ్యం పై దృష్టి పెడుతూ ఉన్నారు. దీనికోసం వర్కౌట్లు మరియు ఎక్సర్సైజులు చేస్తూ ఉన్నారు. ఇలాంటివి ఏమి చేయలేని వారు మాత్రం వాకింగ్ తో సర్దుకుంటున్నారు. అయితే మనం ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు కనీసం పదివేల అడుగులు అయినా వేస్తే కానీ సాధ్యం కాదు అని అంటున్నారు. అయితే తాజా పరిశోధనల ప్రకారం చూస్తే, రోజుకు నాలుగువేల అడుగులు వేసిన చాలు అని అంటున్నారు శాస్త్రవేత్తలు…
ఆ తర్వాత మనం వేసే ప్రతి అడుగు కూడా మన ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతూ వెళ్తుంది అని అంటున్నారు. అయితే లాడ్జ్ మెడికల్ యూనివర్సిటీ యొక్క శాస్త్రవేత్తలు కుర్చీలకే పరిమితం అయిపోతున్నవారు మేము 10,000 అడుగులు వేయలేకపోతున్నాం అని ఇబ్బంది పడేవారికి ఇది కొద్దిగా ఊరట కలిగించే విషయమే అని చెప్పొచ్చు. అలాగే సుమారుగా రెండున్నర లక్ష మందికి పైగా పరిశోధన చేసిన తర్వాత శాస్త్రవేత్తల చెప్పిన విషయాలు ఇవి…
మనం రోజు రెండున్నర వేల అడుగులు వేస్తే వారిలో గుండె ప్రమాదాలు దూరంగా ఉంటాయి అని అంటున్నారు. అలాగే మీరు నాలుగు వేల అడుగులు వేయగలిగితే అన్ని రకాల జబ్బుల నుండి కూడా మీరు దూరంగా ఉండవచ్చు అని అంటున్నారు. ఆ తర్వాత వెయ్యి అడుగులు వేస్తే ఈ ప్రయోజనాలన్నీ మళ్లీ 15% రెట్టింపు పెరుగుతాయి అని అంటున్నారు. అలాగే ఇంకొక 500 అడుగులు గనక మీరు వెయ్యగలిగితే దాదాపుగా వీరు గుండె జబ్బుల నుండి రక్షణ ఉన్నట్టే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటే నడక అనేది సర్వరోగ నివారిణి అని ఈ పాటకి మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది…