Health Tips : అతిగా నిద్రపోతున్నారా..? అయితే మీ గుండె డేంజర్ లో పడినట్లే…!!
Health Tips : సహజంగా నిద్ర అనేది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సరియైన నిద్ర నిద్రించడం వలన మనిషి రోజంతా ఉత్సాహంగా ఉంటాడు. అయితే అదే నిద్ర ఎక్కువగా నిద్రిస్తే మీ గుండె ప్రమాదంలో పడినట్లే అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నిజానికి నిద్రలేమి మాత్రమే కాదు. అతినిద్ర కూడా అనారోగ్యానికి దారితీస్తుంది. ఖాళీగా ఉన్నాం కదా అని అదే పనిగా నిద్రపోతూ ఉంటారు చాలామంది. అయితే ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచి కాదు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఎనిమిది గంటలకు మించి నిద్రపోతారో వారిలో కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ వ్యాదులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
*డిప్రెషన్: డిప్రెషన్ తో బాధపడుతున్న వారు నిద్రలేమిటో బాధపడుతుంటారు. అయితే అది నిద్ర కూడా డిప్రెషన్ కి కారణం అవుతుంది. కావున నిత్య నిద్ర వస్తూ ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి. *గుండె జబ్బులు: అది నిద్ర గుండె జబ్బులకు దారి తీస్తుంది. అవసరమైన దానికంటే నిద్ర ఎక్కువ అయితే హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అది నిద్రకు గుండె జబ్బులకు ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ ప్రతి రోజు 9 గంటల పాటు నిద్రపోయే వారితో పోలిస్తే రోజులు ఏడూ ఎనిమిది గంటల నిద్రపోయే వ్యక్తులలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని హెల్త్ రిపోర్టర్స్ తెలుపుతున్నారు.
*ఊబకాయం: అతి నిద్ర ఊబకాయానికి కారణం అవుతుంది 8:00కు మించి నిద్ర ఒక పోవడం మంచిది. అంతకుమించి నిద్రపోయే వాళ్ళు బరువు త్వరగా పెరుగుతారు. అలాగే అవసరమైన దానికంటే తక్కువ గంటలు నిద్రపోయే వారిలో కూడా గుండె సమస్యలు అధికం. *తలనొప్పి: ఎక్కువ సమయం నిద్రించడం వలన తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఎనిమిది గంటలకు మించిన నిద్ర వలన మెదడులోని కొన్ని రకాల న్యూరో ట్రాన్స్మిటర్ల పై ప్రభావం పడుతుంది. ఇది తలనొప్పికి దారితీస్తుంది. ఇంకా ఉదయం పూట నిద్ర పోతే రాత్రి పూట నిద్రకు భంగం కలుగుతుంది. దీని వలన కూడా తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి.