Childrens : మీ పిల్లలకు ఇప్పటినుంచి ఈ అలవాట్లు నేర్పిస్తే…. చాలా స్ట్రాంగ్ గా అవుతారు…?
ప్రధానాంశాలు:
Childrens : మీ పిల్లలకు ఇప్పటినుంచి ఈ అలవాట్లు నేర్పిస్తే.... చాలా స్ట్రాంగ్ గా అవుతారు...?
Childrens : పిల్లల్ని చిన్నప్పటినుంచి వారి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఎంతో ఆలోచించాల్సి ఉంటుంది. పిల్లలకు వారి జీవితం పై నమ్మకంతో ధైర్యంగా ఎదగాలంటే,వారికి చిన్నతనం నుంచి కొన్ని విషయాలను అలవాటు చేయాల్సి ఉంటుంది. అలాంటి అలవాట్లు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Childrens : మీ పిల్లలకు ఇప్పటినుంచి ఈ అలవాట్లు నేర్పిస్తే…. చాలా స్ట్రాంగ్ గా అవుతారు…?
Childrens పిల్లల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి
పిల్లలతో తల్లిదండ్రులు తరచూ మాట్లాడడం వల్ల వారిలో నమ్మకం. ఏ బాధతో అయితే ఇబ్బంది పడుతున్నారు అది మీతో పంచుకోగలగాలి. మీరు వారిపై ఎలాంటి విమర్శలు లేకుంటా వారి మాటలను ఓపిగ్గా వినాలి. పిల్లల మనసులోని భావాలను చెప్పడానికి వారికి అవకాశం ఇవ్వడం వలన వారి మానసిక ధైర్యం పెరుగుతుంది. చిన్న వయసు నుంచే ఈ అలవాటు ఉన్నవారికి జీవితాంతం ధైర్యంగా ఉంచుతుంది. చిన్నతనం నుంచి కొన్ని నిమిషాల పాటు ధ్యానాన్ని,శ్వాస పద్ధతులను నేర్పిస్తే,వారు తమ మనసును అదుపులో చేసుకోవటం మొదలుపెడతారు. ఎదుర్కోవడానికి కూడా నేర్పించాలి. పరీక్షల సమయంలో మానసికైర్యాన్ని ఇస్తాయి. ధ్యానాన్ని నేర్పించడం వల్ల దృష్టి శక్తి కూడా మెరుగుపడుతుంది. ఇంకా చదువుపై ఏకాగ్రత పెరగడానికి కూడా ఇది ఎంతో సహకరిస్తుంది.
పిల్లలు ఇతరుల భావాలను అర్థం చేసుకోగలగాలి. ఒకరిపై దయ చూపడం,తప్పులు ఒప్పుకోవడం, బాధను అర్థం చేసుకోవడం,లాంటి లక్షణాలు వారి చిన్నప్పటి నుంచే వారి కలవాడు చేస్తూ రావాలి. వారి భావోద్వేగాలు, తెలివితేటలు మెరుగుపరుస్తాయి తమను తాను విశ్లేషించుకునే అలవాటు వారికి మంచి బంధాలు నేర్పరచుకోవడం సహకరిస్తుంది. ఈ రోజుల్లో పిల్లలు డిజిటల్ ప్రపంచానికి చాలా దగ్గర అవుతున్నారు. మొబైల్స్ వాడకం ఎక్కువగా పెరిగిపోతుంది.వీటికి బానిస అయిపోతున్నారు. అయితే ఇందులో కూడా వారు సరైన విధంగా ఉపయోగించుకున్నట్లయితే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మొబైల్, లాప్టాప్ నియమాలు నేర్పించాలి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, మంచి పనులకే టెక్నాలజీని వాడేలా ప్రోత్సహించాలి. స్క్రీన్ టైం కు ఒక పరిమితి పెట్టడం చాలా అవసరం. ప్రతి ఒక పిల్లవానిలో ఏదో ఒక ప్రతిభ ప్రత్యేకంగా ఉంటుంది.
ఒకరికి పాటలు పాడే ప్రతిభ, అందరికీ బొమ్మలు వేయడం, ఆటలు ఆడటం, పిల్లలకి దేని పట్ల ఎక్కువ ఆసక్తి ఉందో అందులో నైపుణ్యం పెరిగేలా వారిని ప్రోత్సహించండి. ప్రొఫెషనల్ గా క్లాసుల్లో చేర్పించే వారికి మరింత మెరుగుపరిచే విధంగా చేయండి. చేయడం పిల్లల్లో స్వయం ప్రేరణను పెంచడమే కాకుండా జీవితంలో ముందుకు వెళ్లడానికి ధైర్యం ఇస్తుంది. ఇంకా, పిల్లలు బలంగాను, సురక్షితంగాను, విజయవంతంగా ఎదగాలంటే, ఈ అంశాలు చాలా ముఖ్యం. పిల్లలకు తల్లిదండ్రులు సరైన మార్గం చూపిస్తే,పిల్లల భవిష్యత్తులో ఏ ఒత్తిడి లైనా అధిగమించే గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. ప్రేమ సహనం సరైన మార్గదర్శకత్వంలో వారి ప్రయాణానికి బలంగా నిలబడేలా చేస్తుంది. దీనితో వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు.