Sukhanya Samriddhi Yojana : సుకన్య సమృద్ధి యోజన పథకం.. ఇలా చేస్తే ఆడపిల్లలకు 70 లక్షలు వస్తాయి..!
ప్రధానాంశాలు:
Sukhanya Samriddhi Yojana : సుకన్య సమృద్ధి యోజన పథకం.. ఇలా చేస్తే ఆడపిల్లలకు 70 లక్షలు వస్తాయి..!
Sukhanya Samriddhi Yojana : సుకన్య సమృద్ధి యోజన పథకం కింద బాలికల భవిష్యత్తు కోసం ఆర్ధిక భద్రత ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆడపిల్లల వయసు 10 ఏళ్లు అంతకన్నా తక్కువ ఉంటే తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సమ్రక్షకులు ఈ ఖాతా తెరవొచ్చు. ఈ పథకం ద్వారా ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకి సహకరించేలా పెద్ద మొత్తం ఒకేసారి వస్తుంది. ఐతే కొన్ని బ్యాంక్ లు ఈ పథకానికి వడ్డీ రేటు అధికంగా ఇస్తున్నాయి. 2024 జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో 8.2 శాతం వడ్డీ రేటు ఇస్తున్నారు. ఈ పథకం కోసం కనిష్టంగా 250 నుంచి గరిష్తంగా 1.5 లక్షలు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా ఖాతా తెరచిన 15 ఏళ్ల దాకా డిపాజిట్లు అనుమతిస్తుంది.
Sukhanya Samriddhi Yojana సుకన్య స
మృద్ధి యోజన మెచ్యురిటీ నియమాలు చూస్తే….
ఎవరైతే ఖాతా తెరుస్తారో వారికి 21 ఏళ్ల తర్వాత లేదా అమ్మాయి 18 ఏళ్లు నిండి పెళ్లైతే పథకం గడువు ముగుస్తుంది. ఈ పథకం లో డిపాజిట్లు ఆప్షన్ 80సి కింద 1.5 లక్షలు వరకు పన్ను మినహాయింపు ఇస్తారు.
Sukhanya Samriddhi Yojana ఇక రిటర్న్స్ విషయానికి వస్తే..
నెలకు 5000 డిపాజిట్ చేస్తే ఏడాదికి 60000 అవుతుంది. అంటే 15 ఏళ్లలో 9 లక్షలు డిపాజిట్ చేస్తారు. అలా 8.2 శాతం వడ్డీ తో కలిపితే 27.92 లక్షలు వస్తుంది. గరిష్ట వార్షిక డిపాజిట్ 1.5 లక్ష చేస్తే అంటే నెలకు 12,333 రూపాయలు డిపాజిట్ చేస్తే 15 ఏళ్లలో 22.5 లక్షల డిపాజిట్ అవుతుంది. వడ్డీతో కలిపి 69.80 లక్షల దాకా వస్తుంది. కర్ణాటకలో ఈ పథకం బాలికల భవిష్యత్తుకి మంచి ఆర్ధిక సహాయం అందిస్తుంది. దీని ద్వారా బాలికల తల్లిదండ్రులు దీర్ఘకాలిక ప్రయోజనం పొందడమే కాకుండా పన్ను ఆదా కూడా చేస్తున్నారు. మీ ఇంట్లో అమ్మాయి ఉందా అయితే వెంటనే సుకన్య సమృద్ధి పథకంలో జాయిన్ చేయండి. ఇప్పటి నుంచి చేస్తేనే వారు యుక్త వయసుకి ఎన్నో అవసరాలకు అది ఉపయోగపడుతుంది. Sukhanya Samriddhi yojana, Scheme, Childrens, Ladies, Sukhanya Scheme