Childrens : పిల్లలకు ఈ 3 విషయాలు తప్పక నేర్పించండి… చాణక్యుడి నీతి వాక్యం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Childrens : పిల్లలకు ఈ 3 విషయాలు తప్పక నేర్పించండి… చాణక్యుడి నీతి వాక్యం…!

Childrens : తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఆందోళన చెందుతూనే ఉంటారు. తన పిల్లలు ఎలా పెరుగుతారు..? వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది..? పెద్దయ్యాక ఏమవుతారు..? ఇలాంటి విషయాలలో పిల్లల చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ…వారి భవిష్యత్తు కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే పిల్లలకు అలవాటు చేసిన అలవాట్లు త్వరగా మారవు. అందుకే చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు మంచి విషయాలు నేర్పిస్తూ పెంచుతారు. అయితే పిల్లల పెంపకం పై శ్రద్ధ […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 September 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Childrens : పిల్లలకు ఈ 3 విషయాలు తప్పక నేర్పించండి... చాణక్యుడి నీతి వాక్యం...!

Childrens : తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఆందోళన చెందుతూనే ఉంటారు. తన పిల్లలు ఎలా పెరుగుతారు..? వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది..? పెద్దయ్యాక ఏమవుతారు..? ఇలాంటి విషయాలలో పిల్లల చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ…వారి భవిష్యత్తు కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే పిల్లలకు అలవాటు చేసిన అలవాట్లు త్వరగా మారవు. అందుకే చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు మంచి విషయాలు నేర్పిస్తూ పెంచుతారు. అయితే పిల్లల పెంపకం పై శ్రద్ధ చూపకపోవడం వలన కొన్ని ముఖ్యమైన విషయాలను వారికి అర్థమయ్యేలా చెప్పకపోవడం వలన తల్లిదండ్రులు విఫలమవుతారని ఆచార్య చానక్యుడు తెలియజేశారు. ఇలాంటి పరిస్థితులలో తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటినుంచి కచ్చితంగా 3 విషయాలను నేర్పించాలని ఆచార్య చాణిక్యుడు తెలియజేయడం జరిగింది. ఈ విషయాలు పిల్లలకు నేర్పించడం వలన వారు జీవితంలో విజయం సాధించడమే కాక వారి భవిష్యత్తుకు వారే పునాది వేసుకుంటారని తెలియజేశారు. మరి ఆ 3 విషయాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Childrens సత్యమార్గంలో నడవడం…

పిల్లలకు చిన్నతనం నుంచే ఈ విషయాన్ని తెలియజేస్తూ పెంచమని చానక్యుడు తెలిపాడు. ఎందుకంటే సత్యమార్గాన్ని అనుసరించే వారికి ఎప్పుడు చెడు జరగదు. అలాంటివారు వారి జీవితంలో అతి తక్కువ సమస్యలను ఎదుర్కొంటారు. వీరు ఎలాంటి అబద్ధాలు చెప్పకుండా నిజాలు మాట్లాడుతూ ఉంటారు. కనుక చిన్నప్పటి నుండే పిల్లలకు సత్యమార్గాన్ని అనుసరించేలా చేయాలని చాణిక్యుడు తెలిపారు. ఇలాంటివారు భవిష్యత్తులో మంచి సమర్ధులవుతారని చాణక్యుడు సూచించాడు.

Childrens క్రమశిక్షణ…

ప్రతి ఒక్కరి జీవితంలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఇక చిన్నతనం నుంచే పిల్లలకు క్రమశిక్షణ నేర్పించడం వలన ప్రతిచోట వారు క్రమశిక్షణ పాటిస్తారు. దీంతో పాఠశాలలో కళాశాలలో మరియు ఆఫీసులో కూడా వీరికి క్రమశిక్షణ అలవాటు అవుతుంది. ఈ విధంగా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేయడం వలన వారి భవిష్యత్తులో ఎంతో ఎదుగుతారని ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొంటారని చాణక్యుడు తెలిపారు. అంతేకాక క్రమశిక్షణతో కలిగి ఉన్న వ్యక్తిని సమాజంలో గౌరవిస్తారు. కాబట్టి చిన్నతనం నుంచే పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని ఆచార్య చాణక్యుడు తెలిపారు.

పిల్లలకు ఈ 3 విషయాలు తప్పక నేర్పించండిచాణక్యుడి నీతి వాక్యం

పిల్లలకు ఈ 3 విషయాలు తప్పక నేర్పించండి…చాణక్యుడి నీతి వాక్యం…

Childrens మంచి విలువలు నేర్పాలి…

ఒక వ్యక్తి ఎలాంటివాడు అనే విషయాన్ని రూపం బట్టి కాకుండా అతని ప్రవర్తన బట్టి నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలకు చిన్నతనం నుండి మంచి విలువలను అలవాటు చేస్తూ తల్లిదండ్రులు పెంచడం వలన వారు ఎప్పటికీ ఎదుటివారిని కించపరిచేలా ప్రవర్తించరు. అంతేకాక విలువలతో పెరిగిన వ్యక్తి సమాజంలో ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు. అదేవిధంగా సమాజంలో గౌరవం లభిస్తుంది. దీంతో ఆ వ్యక్తి కుటుంబం కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కాబట్టి తల్లితండ్రులు వారి పిల్లలకు చిన్నతనం నుండి మంచి విద్యను అందించడంతో పాటు మంచి విలువలను నేర్పించాలని చాణక్యుడు తెలిపారు. ఈ విధంగా చేయడం వలన పిల్లలు భవిష్యత్తులో సమాజం నుంచి మంచి గౌరవాన్ని పొందడంతో పాటు సమాజంలో అభివృద్ధి చెందుతాడు.
ఈ విధంగా ఈ మూడు విషయాలను చిన్నతనం నుంచే పిల్లలకు చెబుతూ పెంచడం వలన భవిష్యత్తులో వారు అన్ని విధాలుగా సమర్థులు అవుతారని చాణక్యుడు తెలిపాడు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది