Health Tips : ఈ రసం తాగితే చాలు.. సంతాన సమస్యలు పరిష్కారం.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ఈ రసం తాగితే చాలు.. సంతాన సమస్యలు పరిష్కారం..

 Authored By mallesh | The Telugu News | Updated on :15 January 2022,9:30 pm

Health Tips : ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా సంతాన సాఫల్య కేంద్రాల సంఖ్య బాగా పెరిగిపోతున్నది. మారుతున్న జీవనశైలి, ఇతర అలవాట్లు సంతానం కలగడం అనేది కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలోనే చాలా మంది సంతానం కోసం వైద్యుల నుంచి సంప్రదించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాగా, ఆ సమస్యలున్న వారు ఈ రసం తీసుకుంటే చాలు.. చక్కటి ప్రయోజనాలుంటాయి.సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో పురుషులు, మహిళలు ఇద్దరూ ఉన్నారు. కాగా, పురుషులలో ముఖ్యంగా వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం వలన సమస్యలున్నాయని పలు పరిశోధనల్లో తేలింది.

ఈ నేపథ్యంలో వీర్య కణాల సంఖ్య పెంచుకోవడానికిగాను ఈ పద్ధతి ఫాలో అయితే చక్కటి ఉపయోగాలుంటాయి. పలు అధ్యయనాల ప్రకారం..50 ఏళ్ల లోపు వారిలో మూడింట ఒక వంతు మందిలో టెస్టోస్టీరన్ లెవల్స్ ఏడు రెట్లు తక్కువగా ఉన్నట్లు తేలింది. దాని వలన బోన్స్ సాంద్రత తక్కువగా ఉంటున్నది. అలా ఎముకల సమస్యల ఏర్పడటంతో పాటు మధుమేహం వచ్చే అవకాశాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.ఇకపోతే శృం పై ఆసక్తి పెంచడానికిగాను రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.

infertility issues by taking this juice you can solve

infertility issues by taking this juice you can solve

Health Tips : ఈ రసంతో చక్కటి ప్రయోజనాలు..

అయితే, శాస్త్రీయంగా రుజువు అయిన వాటిని ఫాలో అయితే చక్కటి ఉపయోగాలుంటాయి. అటువంటి పద్ధతిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెంతుల సారం ద్వారా చక్కటి ఉపయోగాలున్నాయని తేల్చారు. పలువురికి మెంతుల రసం ఇచ్చి పరిశీలన చేయగా చక్కటి ఉపయోగాలున్నట్లు కనుగొన్నారు. మెంతుల రసం ఇచ్చిన వారిలో శృంగార ఆసక్తి, సామర్థ్యం పెరిగినట్లు తేల్చారు. మెంతుల్లో ఉండేటువంటి సాపోనిన్స్ అనే కెమికల్స్, టెస్టోస్టీరాన్ వంటి సెక్స్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారి ఈ మెంతుల రసం తీసుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది