Tea BP : బీపీ ఉన్న వారు టీ తాగితే మంచిదేనా…ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!
ప్రధానాంశాలు:
is it good for health people with bp to drink tea
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి రోజు మొదలవదు. కానీ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదా? ముఖ్యంగా హై బ్లడ్ ప్రెషర్ (బీపీ) ఉన్నవారు టీ తాగొచ్చా? అనే సందేహం చాలామందిలో ఉంది. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు అంటే.. టీలో కెఫీన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజింపజేసి, హృదయ స్పందనను పెంచుతుంది. ఈ ప్రభావం వల్ల రక్తపోటు పెరిగే అవకాశముంటుంది. అందుకే బీపీ ఉన్నవారు తరచుగా లేదా ఎక్కువ మోతాదులో టీ తాగడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tea BP : బీపీ ఉన్న వారు టీ తాగితే మంచిదేనా…ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!
Tea BP : జాగ్రత్తలు తప్పనిసరి
నిపుణుల ప్రకారం, బీపీ ఉన్నవారు రోజుకు ఒక్క కప్పు టీ మాత్రమే తాగాలి. అదీ మరీ బలంగా కాకుండా మితంగా, అవసరమైతే డీకెఫినేటెడ్ టీ (కెఫీన్ లేని టీ) తీసుకోవాలని సూచిస్తున్నారు. చాలామంది ఉదయం లేచిన వెంటనే టీ తాగేస్తుంటారు. అయితే పరగడుపున టీ తాగడం వల్ల ఎసిడిటీ, గుండె మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా బీపీ ఉన్నవారికి ఇది మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉదయం టీ తాగడాన్ని ఆలస్యం చేయడం ఉత్తమం.
మీ బీపీ లెవెల్స్ స్థిరంగా లేనట్లయితే, టీ తాగడాన్ని పూర్తిగా మానేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అంతేగాక, మీరు టీ తాగాలనుకుంటే తప్పనిసరిగా మీ డాక్టర్‌తో సంప్రదించి తాగాలని సూచిస్తున్నారు. టీ తాగేటప్పుడు చక్కెర లేకుండా తాగడం ఆరోగ్యానికి మంచిది. గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ వంటివి ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు. టీ మోతాదు ఎక్కువైతే మానసిక ఆందోళనకు దారి తీయవచ్చు .