Tea : టీ తాగిన వెంటనే ఇవి తింటున్నారా.. అయితే భారీ ముప్పు కొని తెచ్చుకున్నట్టే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea : టీ తాగిన వెంటనే ఇవి తింటున్నారా.. అయితే భారీ ముప్పు కొని తెచ్చుకున్నట్టే..!

 Authored By kranthi | The Telugu News | Updated on :29 December 2021,7:15 am

Tea భారత దేశంలో చాయ్ ప్రేమికుల లెక్క ఇంత అని చెప్పలేం. రోజూ ఒక టీ తాగనిదే తమ డే స్టార్ అవ్వదని చెప్పేవారు ఎంతో మంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం… ఇలా ప్రతి పూట టీ తాగుతూనే ఉంటారు. ఓ కప్పు టీ తాగితే చాలు.. అలసట తొలగిపోయి.. శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ ఇలా ఎన్నో రకాల టీల వల్ల శరీరానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. అయితే టీ తీసుకున్న కాసేపటికే కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు. ఆయా పదార్దాలను టీ తో కలిపి తీసుకుంటే మొదటికే మోసం అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Tea  పుల్లటి పదార్థాలు..

టీ తాగిన వెంటనే.. పుల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఎసిడిటీకి గురయ్యే ప్రమాదం ఉంది. టీ తో పాటు తీసుకునే స్నాక్స్ ఐటమ్స్ లో నిమ్మకాయ లేదా ఏ ఇతర పుల్లని పదార్ధాలను తీసుకోవద్దు.

it is harmful to take these foods afte an hour of drinking tea

it is harmful to take these foods afte an hour of drinking tea

Tea శీతల పానీయాలు..

ఎండ కాలంలో సాధారణంగా టీ తాగక ముందు, తాగిన తర్వాత.. చల్లటి నీరు తాగడం కొంత మందికి అలవాటుగా ఉంటుంది. అయితే

టీ తాగిన వెంటనే చల్లటి నీరు తాగడం హానికరమని నిపుణులు అంటున్నారు. అలాగే టీ తాగిన గంట వరకు ఐస్ క్రీం వంటి చల్లటి పదార్థాలను తినవద్దని సూచిస్తున్నారు.

Tea మొలకెత్తిన ధాన్యాలు..

చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా మొలకెత్తిన ధాన్యాలను అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. అయితే మొలకెత్తిన గింజలు తిన్న వెంటనే టీ తాగడం వల్ల కడుపులోని జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు.

Tea పసుపు..

టీ తాగే సమయంలో పసుపుతో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలట. లేకపోతే.. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసుపు, తేయాకు రెండూ విరుద్ధ గుణాలు కలిగి ఉంటాయంటూ.. ఆయా పదార్థాలు తిన్న వెంటనే టీ తాగొద్దని సూచిస్తున్నారు.

Tea ఉడికించిన గుడ్డు..

డైట్ లో భాగంగా ఉదయానే బ్రేక్ ఫాస్ట్ గా ఉడకబెట్టిన గుడ్లను తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ వెంటనే టీ తాగకూడదట. అలా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు.

Tags :

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది