ఒక్కసారి రాస్తే చాలు.. తలలో పేలన్ని నిమిషంలో మాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

ఒక్కసారి రాస్తే చాలు.. తలలో పేలన్ని నిమిషంలో మాయం…!

కొంతమంది తలకు ఎంత సంరక్షణ చేసినా ఒక సమస్య అయితే అలా పట్టిపీడిస్తూనే ఉంటుంది. అదే తలలో పేలు సమస్య. స్కూలుకు వెళ్లే పిల్లలు అలాగే ఆ పిల్లల తల్లులకు ఈ సమస్య బాగా ఎక్కువ ఉంటుంది. మరికొందరిలో తలను సరిగా శుభ్రం చేయని వారికి తలలో చుండ్రు, రకరకాల సమస్యలు ఉన్నవాళ్లు కూడా పేలు సమస్య అధికంగానే ఉంటుంది. తలలో పేలు ఉండడం వల్ల దురద రాషెస్ చికాకు జుట్టు రాలిపోవడం ఈ సమస్యను కూడా […]

 Authored By aruna | The Telugu News | Updated on :6 July 2023,8:00 am

కొంతమంది తలకు ఎంత సంరక్షణ చేసినా ఒక సమస్య అయితే అలా పట్టిపీడిస్తూనే ఉంటుంది. అదే తలలో పేలు సమస్య. స్కూలుకు వెళ్లే పిల్లలు అలాగే ఆ పిల్లల తల్లులకు ఈ సమస్య బాగా ఎక్కువ ఉంటుంది. మరికొందరిలో తలను సరిగా శుభ్రం చేయని వారికి తలలో చుండ్రు, రకరకాల సమస్యలు ఉన్నవాళ్లు కూడా పేలు సమస్య అధికంగానే ఉంటుంది. తలలో పేలు ఉండడం వల్ల దురద రాషెస్ చికాకు జుట్టు రాలిపోవడం ఈ సమస్యను కూడా ఎక్కువగానే ఉంటాయి. కొంతమందికే ఎన్ని చేసినా కానీ తలలో పేలు పోయినట్టే పోయి మళ్లీ వచ్చేస్తూ ఉంటాయి. తలలో పేలను శాశ్వతంగా పోగొట్టుకోవడానికి అద్భుతమైన ఒక రెమెడీ మీకు పరిచయం చేయబోతున్నాను.

ఈ రెమెడీని వాడితే శాశ్వతంగా పేల సమస్య పోతుంది. అలాగే జుట్టుకు వచ్చిన ఇబ్బందులు ఏవి ఉండవు. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ రెమిడీ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఒక్క వాష్ లోనే పేద గుడ్లని కూడా పోతాయి. ఇప్పుడు ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గుప్పెడు వేపాకులు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద నీడలో ఆరబెట్టుకోండి. ఇవి బాగా ఆరిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో మీకు కావాల్సినంత కొబ్బరి నూనె వేసుకోండి. ఇది కొంచెం వేడి అయిన తర్వాత ఈ వేపాకులను అందులో వేసేయండి. వేపలో మనకు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఆంటీ ఇన్ఫర్మేటరీ గుణాలు ఎక్కువ ఉంటాయి.

it will disappear in a minute as many heads explode

it will disappear in a minute as many heads explode

అందుకే తలలో ఉండే చుండ్రు గాని ప్రతి విధమైన సమస్యలు అలాగే ముఖ్యంగా తలలో పేలును చాలా సమర్థవంతంగా ఈ వేపాకులు తొలగిస్తాయి. ఈ వేపాకులు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం తీసుకోబోయే మరొక ఇంగ్రిడియంట్ వెల్లుల్లి ఒక ఐదు లేదా ఆరు రెబ్బల వరకు వెల్లుల్లిని కొద్దిగా దంచి ఈ నూనెలో వేయండి. నూనె గ్రీన్ కలర్ లోకి వచ్చేవరకు ఒక ఐదు పది నిమిషాలు పాటు ఈ నూనెను బాగా వేడి చేసుకోవాలి. అప్పుడే వేపాకు లోను వెల్లుల్లిలోని ఉండే గుణాలు ఈ ఆయిల్ లోకి వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించి కొంచెం చల్లారనివ్వండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే స్ట్రైనర్ సహాయంతో ఈ ఆయిల్ ని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వడకట్టుకున్న నూనెలో మనం కలుపుకుపోయే మరొక ఇంగ్రిడియంట్ కర్పూరం ఇలా రెండు కర్పూరం బిళ్ళలు తీసుకుని మెత్తగా పౌడర్లా చేసి ఈ ఆయిల్ లో కలిపేయండి.

ఈ కర్పూరం కూడా తలలో పేలును ఈపులను బాగా తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ జుట్టు కి సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేసిన తర్వాత మీ హెయిర్ ని అలా గాలికి వదిలేయకుండా క్లాతు గానీ లేదా షవర్ కాప్ తో గాని కవర్ చేసి ఒక 30 నుంచి 45 నిమిషాల పాటు ఈ ఆయిల్ ని హెయిర్ కి ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కెమికల్ ఫ్రీ షాంపును వాడి హెయిర్ వాష్ చేసుకోవచ్చు. మీకు మొదటి వాష్ లోనే తెలిసిపోతుంది. మీ తలలో పేలు, ఈపులు అన్నీ కూడా పోయి హెయిర్ చాలా తేలిగ్గా ఆరోగ్యంగా ఉన్నట్టు కూడా మీరు గమనిస్తారు..

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది