కొంతమంది తలకు ఎంత సంరక్షణ చేసినా ఒక సమస్య అయితే అలా పట్టిపీడిస్తూనే ఉంటుంది. అదే తలలో పేలు సమస్య. స్కూలుకు వెళ్లే పిల్లలు అలాగే ఆ పిల్లల తల్లులకు ఈ సమస్య బాగా ఎక్కువ ఉంటుంది. మరికొందరిలో తలను సరిగా శుభ్రం చేయని వారికి తలలో చుండ్రు, రకరకాల సమస్యలు ఉన్నవాళ్లు కూడా పేలు సమస్య అధికంగానే ఉంటుంది. తలలో పేలు ఉండడం వల్ల దురద రాషెస్ చికాకు జుట్టు రాలిపోవడం ఈ సమస్యను కూడా ఎక్కువగానే ఉంటాయి. కొంతమందికే ఎన్ని చేసినా కానీ తలలో పేలు పోయినట్టే పోయి మళ్లీ వచ్చేస్తూ ఉంటాయి. తలలో పేలను శాశ్వతంగా పోగొట్టుకోవడానికి అద్భుతమైన ఒక రెమెడీ మీకు పరిచయం చేయబోతున్నాను.
ఈ రెమెడీని వాడితే శాశ్వతంగా పేల సమస్య పోతుంది. అలాగే జుట్టుకు వచ్చిన ఇబ్బందులు ఏవి ఉండవు. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ రెమిడీ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఒక్క వాష్ లోనే పేద గుడ్లని కూడా పోతాయి. ఇప్పుడు ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గుప్పెడు వేపాకులు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద నీడలో ఆరబెట్టుకోండి. ఇవి బాగా ఆరిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో మీకు కావాల్సినంత కొబ్బరి నూనె వేసుకోండి. ఇది కొంచెం వేడి అయిన తర్వాత ఈ వేపాకులను అందులో వేసేయండి. వేపలో మనకు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఆంటీ ఇన్ఫర్మేటరీ గుణాలు ఎక్కువ ఉంటాయి.
అందుకే తలలో ఉండే చుండ్రు గాని ప్రతి విధమైన సమస్యలు అలాగే ముఖ్యంగా తలలో పేలును చాలా సమర్థవంతంగా ఈ వేపాకులు తొలగిస్తాయి. ఈ వేపాకులు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం తీసుకోబోయే మరొక ఇంగ్రిడియంట్ వెల్లుల్లి ఒక ఐదు లేదా ఆరు రెబ్బల వరకు వెల్లుల్లిని కొద్దిగా దంచి ఈ నూనెలో వేయండి. నూనె గ్రీన్ కలర్ లోకి వచ్చేవరకు ఒక ఐదు పది నిమిషాలు పాటు ఈ నూనెను బాగా వేడి చేసుకోవాలి. అప్పుడే వేపాకు లోను వెల్లుల్లిలోని ఉండే గుణాలు ఈ ఆయిల్ లోకి వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించి కొంచెం చల్లారనివ్వండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే స్ట్రైనర్ సహాయంతో ఈ ఆయిల్ ని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వడకట్టుకున్న నూనెలో మనం కలుపుకుపోయే మరొక ఇంగ్రిడియంట్ కర్పూరం ఇలా రెండు కర్పూరం బిళ్ళలు తీసుకుని మెత్తగా పౌడర్లా చేసి ఈ ఆయిల్ లో కలిపేయండి.
ఈ కర్పూరం కూడా తలలో పేలును ఈపులను బాగా తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ జుట్టు కి సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేసిన తర్వాత మీ హెయిర్ ని అలా గాలికి వదిలేయకుండా క్లాతు గానీ లేదా షవర్ కాప్ తో గాని కవర్ చేసి ఒక 30 నుంచి 45 నిమిషాల పాటు ఈ ఆయిల్ ని హెయిర్ కి ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కెమికల్ ఫ్రీ షాంపును వాడి హెయిర్ వాష్ చేసుకోవచ్చు. మీకు మొదటి వాష్ లోనే తెలిసిపోతుంది. మీ తలలో పేలు, ఈపులు అన్నీ కూడా పోయి హెయిర్ చాలా తేలిగ్గా ఆరోగ్యంగా ఉన్నట్టు కూడా మీరు గమనిస్తారు..
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.