Kidney Failure : మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపే లక్షణాలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kidney Failure : మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపే లక్షణాలు ఇవే…!

 Authored By jyothi | The Telugu News | Updated on :31 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Kidney Failure : మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపే లక్షణాలు ఇవే...!

Kidney Failure : ఎలాంటి అనారోగ్య సమస్య అయినా సరే అది బాగా ముదిరిన తర్వాత మాత్రమే మనం వాటిని గుర్తించి పట్టించుకుంటున్నాం.. ఇలా ఎటువంటి సంకేతాలు లేకుండా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే కిడ్నీల గురించి పూర్తిగా తెలుసుకుందాం. చాలామందికి ఆలస్యం అయ్యేవరకు ప్రమాదం గురించి తెలియదు. ఇతర వ్యాధుల మాదిరిగా కాకుండా కిడ్నీ వ్యాధులు చాలా ముదిరే వరకు తరచుగా ఎటువంటి సంకేతాలు చూపించవు.. అందుకే కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో 10 శాతం మందికి మాత్రమే ఆ వ్యాధి ఉందని తెలుస్తుంది. అందువల్ల ప్రజలు వారి పరిస్థితిని తెలుసుకోవడం మరియు వారి మూత్రపిండాలు ఎక్కువ కాలం ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. మీ శరీరంలో ఏదైనా అసాధారణమైన భౌతిక సంకేతాలను మీరు ఎదుర్కొంటే వెంటనే పరీక్ష చేయించుకోవడమే ఉత్తమం. మీకు మూత్రపిండాలు విఫలమైతే మీరు గమనించే మొదటి సంకేతం మూత్ర విసర్జనలో మార్పు.. మన శరీరంలో మూత్రాన్ని ఉత్పత్తి చేయడానికి మూత్రపిండాలు బాధ్యత వహిస్తాయి. ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేసి మన శరీరంలోని వ్యర్ధాలను తొలగిస్తాయి. ఇవి మూత్రపిండాల ద్వారా మూత్రశయానికి పంపబడతాయి.

ఆ తర్వాత మన శరీరం వ్యర్ధాలను మూత్రంగా బయటకు పంపుతుంది. కాబట్టి నిరంతరం మన కిడ్నీల పని తీరుపై మనం కనీస అవగాహన కలిగి ఉండాలి. మరి కిడ్నీలకు సంబంధించి ఎటువంటి సంకేతాలు మనం గమనించాలి అంటే.. మీ మూత్రపిండాలు మూత్రం ఉత్పత్తిలో నెమ్మదిగా ఉంటే లేదా పూర్తిగా ఉత్పత్తి చేయడానికి ఆపివేస్తే.. అది మూత్రపిండాల వైఫల్యానికి సంకేతం కావచ్చు.. ఇది కిడ్నీ నుండి మూత్ర విసర్జనను అడ్డుకోవడం వల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలు చేరుతాయి.. మూత్రపిండాల్లో రాళ్లు లేదా ఇన్ఫెక్షన్ ఉనికిని సూచిస్తుంది. 60 ఏళ్ళు పై పడ్డవారికి ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కిడ్నీ వ్యాధులు ఉన్న వారిలో ప్రధానంగా నిద్రలేమి కూడా సమస్య ఉంటుంది. మూత్రపిండాలు మలినాలను సరిగా ఫిల్టర్ చేయనప్పుడు టాక్సిన్స్ మూత్రం ద్వారా బయటికి పోకుండా రక్తంలోనే ఉండిపోతాయి. దీనివల్ల నిద్ర సరిగా పట్టదు. కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ఈ లక్షణం కూడా కనిపిస్తుంది. అలాగే చేతులు పైన ముఖం పైన దురదలు దద్దుర్లు వంటివి కూడా కనబడతాయి. చర్మం పొడిగా మారిపోతుంది. రక్తంలో ఖనిజాలు పోషకాల సమతుల్యతను కాపాడేది కూడా మూత్రపిండాల పనితీరి కనుక దీర్ఘకాలంగా దద్దుర్లు దురదలు వేధిస్తుంటే ఒకసారి చెక్ చేయించుకోండి. ఇక కిడ్నీ వ్యాధుల వల్ల దీనివల్ల కళ్ళ చుట్టూ వాపు వస్తుంది. శరీరంలోని ప్రోటీన్ అధికంగా మూత్రం ద్వారా బయటికి పోయినప్పుడు ఇలా రెండు కాళ్ళ కింద వాపు వస్తుంది.

అలాగే కాళ్లలో పాదాలలో వాపులను కూడా లైట్ తీసుకోకండి. ఇది కూడా కిడ్నీ వ్యాధులకు సూచిక. అధికంగా ఉన్న ద్రవాలు కిడ్నీలు ఫిల్టర్ చేసి బయటకు పంపడంలో ఫెయిల్ అయినప్పుడు ఇలా కాళ్లు పాదాలు చేతుల్లో వాపు కనిపిస్తుంది. అలాంటప్పుడు ముందుగా ఉప్పు ద్రవపదార్థాలు తీసుకోవడం తగ్గించి తీసుకోవాలి. కండరాల వాపు, తిమ్మిరి కూడా కలుగుతుంది. శరీరంలో ద్రవాలు ఎలక్ట్రోలైట్ల యొక్క కారణంగా ఇలా తిమ్మిరి ఏర్పడుతుంది. నరాలు దెబ్బ తినడం రక్తప్రసరణలో ఆటంకాలు కలుగుతాయి. బలహీనమైన మూత్రపిండాల కారణంగా కూడా ఇలా జరుగుతుంది. కనుక ఇలాంటి లక్షణాలు ఉంటే తేలిగ్గా తీసుకోకండి. కిడ్నీకి సంబంధించి ఇటువంటి సంకేతాలు కనుక మీకు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మరి ఇప్పుడు కిడ్నీలో పనితీరు బావుండాలి ఆరోగ్యంగా శుభ్రంగా ఉండాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో కూడా చూద్దాం. ముందుగా బెర్రీలు, క్యాబేజీ, వెల్లుల్లి, ఆకుకూరలు, పండ్లు, చేపలు శరీరానికి ఇది చాలా మంచిది. అనేక రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది