Eyes Kidneys : మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని… ఈ విధంగా మీ కంటిలోనే కనిపించే ఒక సీక్రెట్ సింటమ్స్…?
ప్రధానాంశాలు:
Eyes Kidneys : మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని... ఈ విధంగా మీ కంటిలోనే కనిపించే ఒక సీక్రెట్ సింటమ్స్...?
Eyes Kidneys : శరీర అవయవాలలో ప్రధానమైన అవయవం కిడ్నీలు కూడా ఒకటి.ఈ కిడ్నీల పనితీరు బాగుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన శరీరంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన విషయాలు బయటకు పంపుటకు ఈ కిడ్నీలు పాత్రను వహిస్తాయి. కిడ్నీలు పాడు కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.వాటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తుండాలి. జీవనశైలి, తీసుకుంటున్న ఆహారాల కారణంగా,చాలామందికి కిడ్నీ ఫెయిల్యూర్ వంటి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి మీరు ప్రమాదంలో ఉన్నారని సంకేతం మీ కళ్ళల్లో పలు లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరి అది ఎలానో తెలుసుకుందాం…

Eyes Kidneys : మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని… ఈ విధంగా మీ కంటిలోనే కనిపించే ఒక సీక్రెట్ సింటమ్స్…?
Eyes Kidneys: ఉబ్బిన కళ్ళు
కళ్ళు ఉబ్బడం అనేది కొన్నిసార్లు సహజం. అయితే, కొన్నిసార్లు కంటి నిండా నిద్రపోయినా, కళ్ళు ఉబ్బినట్లు అనిపిస్తే,అది రోజుల తరబడి అలాగే కనిపిస్తూ వస్తే, జాగ్రత్త పడాల్సి ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే కొన్నిసార్లు మూత్రపిండాలు దెబ్బతింటే కూడా కళ్ళు ఊపినట్లు కనిపిస్తాయి దీన్ని ప్రోటీన్యూరియా అంటారు. కాబట్టి, ఇలా కనుక మీకు అనిపిస్తే ఈ విషయంలో చాలా జాగ్రత్త అవసరం.
అస్పష్టమైన కంటి చూపు : మూత్రపిండాలు ప్రమాదంలో ఉన్నట్లయితే కంటిచూపు అస్పష్టంగా కనిపిస్తుందట. ఎందుకంటే,అధిక రక్తపోటు, మధుమేహ సమస్యలు ఉన్న వారిలో అవి వారి కంటిలోని రక్తనాళాలను కూడా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల దృష్టిలో మార్పులు వస్తాయి.ఇది మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.
కళ్ళు పొడిబారడం : కళ్ళు పొడుబారడం కొన్ని సమయంలో సహజం. కానీ, తరచూ కళ్ళు పొడి మారడం, కంటిలో దురద వంటి సమస్యలు తలెత్తితే జాగ్రత్త పడాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే, మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారిలో ఈ సమస్య ఉంటుందట.
కళ్ళు ఎక్కువగా ఎరుపు రంగులోకి మారడం : కళ్ళు ఎక్కువగా ఎరుపు రంగులోకి మారితే అది మూత్రపిండాల సమస్య ఉందని సూచిస్తుంది.కొన్ని సాధారణ కారణాల వల్ల కూడా కళ్ళు ఎరుపెక్కుతాయి. కళ్ళల్లో ఏదైనా గాయం అయినా లేదా దుమ్ము ధూళి పడినప్పుడు మాత్రమే కళ్ళు ఎరుపు రంగులోకి మారతాయి. కానీ మీ కళ్ళు ఎప్పుడు ఎరుపు రంగులోనే ఉంటే మాత్రం తప్పకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఇలా ఎటువంటి కారణం లేకుండా కళ్ళు ఎరుపు రంగులోకి మారడం మూత్రపిండాల వ్యాధికి ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.
ఇంకా కిడ్నీ సమస్యలు ఉన్నవారు, రంగులను చూడటంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మూత్రపిండాల సమస్యలు ఉన్న కొంతమందికి, కొన్ని రంగులను ముఖ్యంగా, నీలం, పసుపు రంగులు వేరు చేయటం కష్టంగా అనిపించవచ్చు. ఇది ఆప్టిక్ నరాల దెబ్బతినడం లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా, కంటి రెటీనాలో మార్పుల వల్ల వస్తుందట.